ఐఎస్‌పై ఉక్కుపాదం.. పుతిన్‌తో గంటసేపు మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. పక్కా ప్లాన్?
ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ ప్రపంచ దేశాల నోళ్ళల్లో నానుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఐఎస్‌పై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతున్నారు. గత పాలకులు అవలంబించిన విధానాలతో పోలిస్తే, ఉగ్రవాదం
ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ ప్రపంచ దేశాల నోళ్ళల్లో నానుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఐఎస్‌పై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతున్నారు. గత పాలకులు అవలంబించిన విధానాలతో పోలిస్తే, ఉగ్రవాదంపై తాను కఠినంగా ఉంటానన్న విషయాన్ని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు.
దాదాపు గంటపాటు జరిగిన సంభాషణలో, సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సంయుక్త దళాలను పంపే దిశగా చర్చలు సాగినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. రష్యా, అమెరికాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని తేలిక పరిచేలా ఇరు దేశాల అధినేతలూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఐఎస్ఐఎస్‌ను ఎలా ఓడించాలన్న విషయమై వ్యూహాన్ని రచించాలని పెంటగాన్‌ను ట్రంప్ ఆదేశించారు. ఇదే సమయంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ను పునర్వ్యవస్థీకరించాలని కూడా ఆయన సూచించారు.