జార్జ్ ఫ్లాయిడ్ మరణం విషాదకరమైనదని, జాత్యాహంకారం యొక్క పాపం ఫలితంగానే ఆయన చనిపోయారని పోప్ ఫ్రాన్సిస్ విచారం వ్యక్తం చేశారు. జార్జి ఫ్లాయిడ్ హత్య ముమ్మాటికీ జాత్యాహంకార పాపమే అని పేర్కొన్నారు.
జాత్యాహంకారం భరించలేనిది, అయినప్పటికీ విధి హింస విచ్చినమైందని, స్వీయ విధ్వంసం-స్వీయ ఓటమి అని అన్నారు.
ఆందోళనలు వైట్‌హౌస్‌కు చేరుకోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంకర్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిసిందని, ఈ నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ తన విచారాన్ని వ్యక్తంచేస్తూ.. అల్లర్లు శృతిమించి ప్రజలు ఇబ్బందులకు గురవకముందే జాతీయ సయోధ్యకు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
న్యాయం జరగాలి : జార్జి ఫ్లాయిడ్ భార్య
తన భర్త చావుకు సరైన న్యాయం జరగాలని జార్జి ఫ్లాయిడ్ భార్య రాక్సీ వాషింగ్టన్ డిమాండ్ చేశారు. రాక్సీ తన కూతురితో పాటు మీడియా ముందుకు వచ్చారు.
'నా భర్త ఫ్లాయిడ్‌కు కూతురు గియానా(6) అంటే ఎంతో ఇష్టం. ఫ్లాయిడ్ తన కూతురు ఎదుగుదలను చూడకుండానే మరణించాడు.
తన కూతురిని విద్యావంతురాలిగా చూడకుండానే ప్రాణాలు వదిలాడు. నా కూతురు ఇప్పుడు తండ్రిని పోగొట్టుకుంది. నాకు న్యాయం కావాలి' అని రాక్సీ తెలిపారు.