Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో బ్యాచిలర్ విలేజ్: 100కి పైగా పెళ్ళికాని ప్రసాద్‌లు.. రోడ్డు సరిగ్గా లేదని పిల్లనివ్వట్లేదు..

చైనాలో ఓ బ్యాచిలర్ విలేజ్ ఉంది. ఇక్కడ అబ్బాయిలకు నాలుగు పదులు దాటినా పిల్లనిచ్చే వారు దొరకరు. ఇందుకు కారణం ఏంటంటే.. ఆ ఊరుకు సరైన రోడ్డు లేకపోవడమే. అయితే ఈ గ్రామానికి చెందిన జియంగా అనే యువకుడు కట్టుకున

Advertiesment
lonely men
, మంగళవారం, 30 ఆగస్టు 2016 (14:38 IST)
చైనాలో ఓ బ్యాచిలర్ విలేజ్ ఉంది. ఇక్కడ అబ్బాయిలకు నాలుగు పదులు దాటినా పిల్లనిచ్చే వారు దొరకరు. ఇందుకు కారణం ఏంటంటే.. ఆ ఊరుకు సరైన రోడ్డు లేకపోవడమే. అయితే ఈ గ్రామానికి చెందిన జియంగా అనే యువకుడు కట్టుకునే భార్య కోసం అందమైన వెదురు ఇల్లు కట్టుకున్నాడు. అన్ని సౌకర్యాలు అమర్చుకున్నాడు.

అయితే ఎవ్వరూ పిల్లనివ్వలేదు. రోడ్డు బాగోలేదని.. సాకు చెప్తున్నారు. అయినా జియంగా ఏమాత్రం భయపడట్లేదు. ఇంకా ఈ బ్యాచిలర్ విలేజ్ హీరో జియాంగ్ తన తోడును వెతుక్కున్నాడు. అయితే ఆవిడ ఎక్కువ రోజులు తనతో స్నేహం చేయలేదు. సేమ్ రోడ్డు స్టోరీ చెప్పి వెళ్లిపోయింది.
 
ఇలా వందమంది జియంగాలు ఆ ఊళ్లో పెళ్ళి కాకుండా ఉన్నారు. ఇందుకు కారణం చైనా సర్కారు 1980లో తీసుకొచ్చిన వన్ చైల్డ్ పాలసీ కూడా ఒక కారణం. దీంతో దేశంలో మహిళల సంఖ్య తగ్గింది. 115 పురుషులు పుడితే 100మంది మహిళలు జన్మిస్తున్నారు. 
 
ఇలా అమ్మాయిలు తక్కువవుతుంటే.. అబ్బాయిలు పెరుగుతూపోయారు. దీంతో పాటు మరోకారణం కూడా ఉంది. గ్రామాల్లోని అమ్మాయిలు ఉపాధి వెతుకుతూ వలసల పోవడం కూడా అబ్బాయిలకు పెళ్లిళ్లు కాకపోవడానికి కారణమని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్కువ వయసున్న భార్యతో భర్త లైంగికచర్య రేప్‌గా చూడలేం : కేంద్రం