అంతరిక్షంలో భూమిని పోలిన మరో గ్రహం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని సూపర్ ఎర్త్‌గా వారు పేర్కొంటున్నారు. ఇది ఆరు కాంతి సంవత్సరాలకు దూరంలో ఈ సూపర్ ఎర్త్ ఉన్నట్టు తాము గుర్తించినట్టు వారు తెలిపారు.
ఈ గ్రహం సూర్యుడుకి సమీపంలో ఉన్న బెర్నార్డ్స్ నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, స్పేస్ స్టడీస్ ఆఫ్ కాటలోనియా, స్పెయిన్స్ ఇనిస్టిట్యూట్ ఆ్ స్పేస్ సైన్సెస్ పరిధోక బృందం వెల్లడించింది. పైగా, ఈ సూపర్ ఎర్త్ భూమికంటే 3.2 రెట్లు పెద్దదని, గడ్డకట్టిన స్థితిలో ఉన్నట్టు తెలిపారు.
ఈ సూపర్ ఎర్త్‌పై 170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని, అందువల్ల ఈ గ్రహం ఏమాత్రం నివాసయోగ్యమైనది కాదని తెలిపారు. 20 యేళ్ళపాటు పరిశోధనల అనంతరం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపారు.