Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లంకా నగర ప్రభువు విమానయానంపై శ్రీలంక పరిశోధన (video)

Advertiesment
లంకా నగర ప్రభువు విమానయానంపై శ్రీలంక పరిశోధన (video)
, మంగళవారం, 21 జులై 2020 (14:30 IST)
లంకా నగర ప్రభువు రావణాసురుడు. ఈ లంకాధీసుడైన రావణాసురుడు విమానంలో ప్రయాణించినట్టు శ్రీలంక పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇదే అంశంపై అధ్యయనం కూడా చేస్తున్నట్టు చెప్పింది. 
 
లంకా న‌గ‌ర ప్ర‌భువు విమానయానానికి సంబంధించిన స‌మాచారాన్ని త‌మ‌కు ఇవ్వాలంటూ విమాన‌యాన సంస్థ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ ఇటీవ‌ల ఓ ప్ర‌ట‌క‌న చేసింది. రావ‌ణాసురుడు ప్ర‌యాణించిన ఆకాశ‌మార్గాల‌పై తాము అన్వేష‌ణ చేయ‌నున్నామ‌ని, దానికి సంబంధించిన స‌మాచారం ఉంటే త‌మ‌కు ఈవెయిల్‌, ఫోన్ చేయాల‌ని శ్రీలంక విమానయాన శాఖ ఆ యాడ్‌లో పేర్కొన్న‌ది. 
 
రావ‌ణుడి విమాన‌యానం గురించి అనేక క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయ‌ని, వాటిని క్రోఢీక‌రించేందుకు ఈ ప్రాజెక్టు చేప‌ట్టిన‌ట్లు ఓ అధికారి తెలిపారు. వేల సంవ‌త్స‌రాల క్రితం శ్రీలంక‌ను రావ‌ణాసురుడు ఏలిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. 
 
అయితే రావ‌ణుడు అనేక గ‌గ‌న మార్గాల్లో విమాన ప్ర‌యాణం చేసిన‌ట్లు కూడా క‌థ‌లు ఉన్నాయి. ఆ మార్గాల‌ను తెలుసుకునేందుకు స్ట‌డీ చేప‌ట్టిన‌ట్లు సివిల్ యేవియేష‌న్ అథారిటీ అధికారి ఒక‌రు చెప్పారు. భార‌త్ నుంచి వ‌స్తున్న ప‌ర్యాట‌కుల‌కు శ్రీలంక‌లో రామాయ‌ణ సంబంధిత ప్ర‌దేశాల‌ను చూపిస్తుంటారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి