Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకాక్ లో 70 అంతస్తుల భవనం పైనుంచి...

Advertiesment
బ్యాంకాక్ లో 70 అంతస్తుల భవనం పైనుంచి...
, గురువారం, 28 ఫిబ్రవరి 2019 (22:18 IST)
మీరెప్పుడైనా స్కైవాక్ చేసారా? పేరులో ఉన్నట్లే స్కైవాక్ అంటే ఆకాశంలో నడవడమే. గాలిలో తేలిపోతున్న ఫీలింగ్‌తో సందర్శకులు ఆశ్చర్యానికి లోనవుతారు. కాళ్ల కింద ఏమీ లేనట్లు మొత్తం అద్దాలపై నడిచే ఫీలింగ్‌తో గుండె మరింత వేగంగా కొట్టుకునేలా చేసే ఈ స్కైవాక్ బ్యాంకాక్ నగరంలో ఉంది. 
 
రోజూ వేలాది మంది సందర్శకులు ప్రపంచం నలుమూలల నుండి వస్తుంటారు. సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మరోపక్క బలహీనమైన గుండె కలిగిన వారు స్కైవాక్ మీద అడుగుపెట్టకపోవడమే మంచిదంటూ నిర్వాహకులు చెప్తున్నారు.
 
బ్యాంకాక్‌లో 70 అంతస్తులకు పైగా ఎత్తులో కింగ్ పవర్ మహానఖా అనే స్కైవాక్‌ను ఇటీవలే నిర్మించారు. 1030 అడుగుల ఎత్తు ఉన్న ఈ కట్టడం సందర్శకుల్ని సంభ్రమార్చర్యాలకు గురిచేస్తుంది. కాగా 74, 74 అంతస్తులో అబ్జర్వేషన్ డెక్‌ను ఏర్పాటు చేసారు. అక్కడ నుండి సిటీ అందాలను సుస్పష్టంగా వీక్షించవచ్చు. ఇక్కడి నుండి బ్యాంకాక్ నగరాన్ని 360 డిగ్రీల్లో పూర్తిగా వీక్షించవచ్చు. ఇక 78వ అంతస్తులో పైన రూఫ్‌టాప్ ప్లాట్‌ ఫామ్‌ను ఏర్పాటు చేసారు. అక్కడే బార్ కూడా ఉండడం విశేషం.
 
ఆ స్కైవాక్‌లోకి షూలతో వెళ్లేందుకు అనుమతించరు. గ్లాసు మీదే నడవాల్సి ఉంటుంది కాబట్టి బూట్ల మీద క్లాత్‌తో చేసిన మృదువైన గ్లోవ్స్ వంటివి ధరించాల్సి ఉంటుంది. అయితే గ్లాసుతో చేసిన ఇలాంటి బ్రిడ్జి చైనాలో కూడా ఉండటం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బర్త్ డే పార్టీ... తాగిన మత్తులో అలా చేశామన్న యువకులు...