Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల గదిలో సీసీటీవీ కెమెరాలు పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. మూడేళ్ల జైలు.. ఊడిన ఉద్యోగం!

ఏదైనా షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లినప్పుడు, హోటల్స్‌కి వెళ్లినప్పుడు రహస్య కెమెరాలతో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో వినేవుంటాం. అయితే ఈసారి మహిళల గదిలో సీసీటీవీ కెమెరాలను పెట్టాడు ఓ బ్యాంక

Advertiesment
Secret
, శుక్రవారం, 17 జూన్ 2016 (13:12 IST)
ఏదైనా షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లినప్పుడు, హోటల్స్‌కి వెళ్లినప్పుడు రహస్య కెమెరాలతో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో వినేవుంటాం. అయితే ఈసారి మహిళల గదిలో సీసీటీవీ కెమెరాలను పెట్టాడు ఓ బ్యాంకు ఉద్యోగి. దుస్తులు మార్చుకునే రూంలో ట్రయల్‌ రూమ్‌లో ఉన్న రహస్య కెమెరాను సకాలంలో గుర్తించడంతో కెమెరా బండారం బయటపడింది. 
 
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే లగ్జెంబర్గ్‌లో యూరోపియన్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకులో దాదాపు 3000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో మహిళలే అత్యధికంగా పనిచేస్తున్నారు. కాగా ఇందులోనే ఉద్యోగం చేస్తున్న ఓ 50 ఏళ్ల కామాంధుడు చడీచప్పుడు కాకుండా మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో టేబుల్ కింద సీసీటీవీ కెమెరాలు పెట్టేశాడు. ఈ విషయం తెలియని మహిళలు తరచూ ఆ గదిలోకి వెళ్లే కార్యకలాపాలు చేసుకునేవారు. 
 
ఒక రోజు ఈ సీక్రెట్ కెమరా గుట్టు బయటపడటంతో విచారణకు ఆదేశించగా అసలు విషయంతెలిసింది. దాదాపు ఈ సీక్రెట్ సీసీటీవీ బారిన ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 150 మంది మహిళలు పడినట్లు ఆ బ్యాంకు ఉన్నత ఉద్యోగి తెలిపారు. ఆ బ్యాంకు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. పోలీసుల విచారణలో నిజాన్ని అంగీకరించాడు. దీంతో మూడేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు ఆ బ్యాంకు ఉద్యోగం కాస్త ఊడిపోయింది. అయితే, ఆ ఫుటేజీని ఎవరూ చూడలేదని, నేరుగా దర్యాప్తు బృందానికి ఇచ్చామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22న కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. స్మృతికి స్థానచలనం.. బీహార్‌‌కు మొండిచేయి.. కొత్తవారికి ఛాన్స్