Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఫోన్‌ని మిక్సీలో వేసి రుబ్బాడు... అందుకే అతడికి బుర్ర లేదంటూ కామెంట్లు...

Advertiesment
Scientist
, శుక్రవారం, 15 మార్చి 2019 (15:46 IST)
ప్రస్తుతం మనుషుల కంటే స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువయ్యాయి. ఒక్కొక్కరి దగ్గర రెండుమూడు ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్లీ సరికొత్త వాటివైపు పరుగులు తీస్తుంటారు. దీని వలన పాతవి స్క్రాప్ అయిపోతాయి. ఫోన్ల స్క్రాప్ పెరిగిపోతూ ఉంటే వాటిని ఏం చేయాలి, వాటిని రీసైకిల్ చేయవచ్చా? ఫోన్ లోపలి భాగంలో ఏముంటుంది? వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అనే సందేహం బ్రిటన్‌లోని ప్లయ్‌మౌత్ యూనివర్సిటీకి సైంటిస్ట్‌లకు వచ్చింది.
 
ఆ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేసారు. ఓ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొని దానిని మిక్సీలో వేసి రుబ్బారు. దీంతో స్మార్ట్‌ఫోన్ కాస్త చిన్న చిన్న ముక్కలు అయిపోయింది. అందులో కొంచెం పొడి కూడా వచ్చింది. ఆ పొడిని తీసుకొని 500 డిగ్రీల సెల్సియస్ వేడిలో కరిగించి, దానికి యాసిడ్స్ జత చేసి డిటెయిల్‌గా పరిశోధన జరిపారు.
 
ఫోన్ పార్టికల్స్‌లో 33 గ్రాముల ఐరన్, 13 గ్రాముల సిలికాన్, 7 గ్రాముల క్రోమియం, 90 మిల్లీగ్రాముల సిల్వర్, 36 మిల్లీ గ్రాముల బంగారం కంటెంట్ ఉందని తేలింది. వీటితో పాటుగా క్రిటికల్ ఎలిమెంట్స్ అయిన టంగ్‌స్టన్ 900 మిల్లీగ్రాములు, 70 మిల్లీగ్రాములు కోబాల్ట్, మోలిబ్డెనమ్, 160 మిల్లీగ్రాముల నియోడైమియమ్, 30 మిల్లీగ్రాముల ప్రాసియోగైమియమ్ కూడా ఉన్నాయట. ఈ పరిశోధన ద్వారా ఫోన్‌లోని ఏ వస్తువును రీసైకిల్ చేయవచ్చు అని తెలుస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
 
ఈ పరిశోధనకు సంబంధించిన వీడియోని యూనివర్శిటీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్‌లు చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇది చేయడానికి ఫోన్‌ని మిక్సీలో వేసి తిప్పాలా? మ్యానుఫ్యాక్చురర్‌ని అడిగితే చాలదు.. లిస్ట్ ఇస్తాడు అని కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏటీఎం నుండి డ్రా చేసిన డబ్బులు చూసి షాక్‌ అయిన కస్టమర్‌..!