Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మాయి బొమ్మ చూసి చొంగ కార్చుకుంటున్నారు... రమ్మని పిలిచీ....

ఇటీవలి కాలంలో ఆల్ లైన్ మోసాలు ఎక్కువయిపోతున్నాయి. ఇవేదే బ్యాంకుల వరకే అనుకుంటే పొరబాటే. ఆన్ లైన్ ద్వారా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. వాటిలో ఆన్ లైన్ డేటింగ్ కూడా ఒకటి. ఈమధ్య కాలంలో ఆన్ లైన్ డేటింగ్ చేసేందుకు రెడీ అంటూ అందమైన అమ్మాయిల ఫోటోలు దర్శనమివ్వ

అమ్మాయి బొమ్మ చూసి చొంగ కార్చుకుంటున్నారు... రమ్మని పిలిచీ....
, ఆదివారం, 29 జనవరి 2017 (09:55 IST)
ఇటీవలి కాలంలో ఆల్ లైన్ మోసాలు ఎక్కువయిపోతున్నాయి. ఇవేదే బ్యాంకుల వరకే అనుకుంటే పొరబాటే. ఆన్ లైన్ ద్వారా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. వాటిలో ఆన్ లైన్ డేటింగ్ కూడా ఒకటి. ఈమధ్య కాలంలో ఆన్ లైన్ డేటింగ్ చేసేందుకు రెడీ అంటూ అందమైన అమ్మాయిల ఫోటోలు దర్శనమివ్వడం ఎక్కువైందట. ఆ అందమైన అమ్మాయిల బొమ్మలను చూసిన పురుషులు చొంగ కార్చుకుంటూ అప్లై చేసుకుంటున్నారట. 
 
ఇదే తడవుగా తను ఫలానా చోటకు రావాలంటే అంత డబ్బు కావాలని సదరు అమ్మాయి కండిషన్ పెడుతోందట. అమ్మాయి గొంతు, ఆన్ లైన్లో బొమ్మను చూసిన సదరు పురుషుడు ఆగలేక అడిగినంత డబ్బు చెప్పిన ఖాతాలో జమ చేసేస్తున్నారట. డబ్బు పడటం ఆలస్యం వీళ్లకు రంగు పడుతోందట. అంటే... డబ్బు ఖాతాలోకి జమ కాగానే సదరు అమ్మాయి వెంటనే తన ఫోటోతో పాటు అన్నీ క్యాన్సిల్ చేసేసి ఇతడిని కట్ చేసేస్తోందట. 
 
తను మోసపోయానని తెలుసుకున్న ఆ మగాడు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేస్తున్నారట. ఈ బెడద ఎక్కువగా ఇంగ్లాండులో వున్నట్లు తాజా గణాంకాలు చెపుతున్నాయి. అక్కడ సుమారు 40 శాతం మంది పురుషులు ఈ ఆన్ లైన్ డేటింగ్ చేసి మోసపోతున్నారట. విశేషమేమిటంటే... ఆన్ లైన్లో అమ్మాయిల బొమ్మలు పెట్టి మోసం చేస్తున్నవారిలో 90 శాతం మంది మగాళ్లేనట. కేవలం 10 శాతమే అమ్మాయిలుంటున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వలస ప్రజల చమట, నెత్తుటితో బతికిన దొడ్డ దేశం ఆ వలసలనే వద్దంటోంది