సెప్టెంబర్‌కల్లా వచ్చేయండి... ప్రయాణ ఖర్చులన్నీ మేమే భరిస్తాం : సుష్మా స్వరాజ్
సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు వారు పని చేసిన కంపెనీలకు క్లెయింలు అందజేసి.. సెప్టెంబర్ 25వ తేదీకల్లా భారత్‌కు తిరిగి రావాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కోరారు.
సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు వారు పని చేసిన కంపెనీలకు క్లెయింలు అందజేసి.. సెప్టెంబర్ 25వ తేదీకల్లా భారత్‌కు తిరిగి రావాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కోరారు. లేని పక్షంలో తిరుగు ప్రయాణానికి అయ్యే ఖర్చులన్నీ వారే భరించాల్సి ఉంటుందని ట్విట్టర్లో స్పష్టంచేశారు. సౌదీలోని భారతీయులకు మంత్రి ఇటువంటి విజ్ఞప్తి చేయడం ఇది రెండోసారి.
ఆదివారం ఇదే తరహా ప్రకటన చేసిన సుష్మ.. మూతపడిన కంపెనీలతో సౌదీ ప్రభుత్వం మాట్లాడి సెటిల్మెంట్లు చేస్తుందని, చెల్లింపులకు సమయం పడుతుందని, అప్పటిదాకా అక్కడే వేచి చూడటం అనవసరమని పేర్కొన్నారు. సౌదీలో తమ కష్టాలు పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అక్కడి భారతీయులు కోరిన నేపథ్యంలో విదేశాంగశాఖ సహాయ మంత్రి వీకేసింగ్ హుటాహుటిన సౌదీకి వెళ్లి అక్కడి ప్రభుత్వంతో మాట్లాడిన విషయం తెల్సిందే.