Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు కుమార్తెలపై లైంగిక వేధింపులు... తండ్రిపై పోక్సో చట్టం

కామంతో కళ్లు మూసుకుపోయి తన ఇద్దరు కుమార్తెలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కన్నతండ్రిపై పుదుచ్చేరి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస

ఇద్దరు కుమార్తెలపై లైంగిక వేధింపులు... తండ్రిపై పోక్సో చట్టం
, బుధవారం, 24 ఆగస్టు 2016 (09:18 IST)
కామంతో కళ్లు మూసుకుపోయి తన ఇద్దరు కుమార్తెలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కన్నతండ్రిపై పుదుచ్చేరి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
పుదుచ్చేరి నగర శివార్లలోని కాలాపేట గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం గత కొన్ని నెలలుగా తన ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పాఠశాల విద్యార్థినులకు ఛైల్డ్ లైన్ సిబ్బంది నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సాక్షాత్తు తండ్రి ఇద్దరు కూతుళ్లపై జరిపిన పైశాచికత్వం ఘటన వెలుగుచూసింది. 
 
ఈ దారుణ ఘటనపై 13, 14 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలికల వాంగ్మూలాన్ని బాలల సంక్షేమ కమిటీ సభ్యులు తల్లి సమక్షంలోనే నమోదు చేశారు. బాలల సంక్షేమ కమిటీ ఈ ఘటనపై కాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడైన బాలసుబ్రమణ్యంపై బాలల లైంగిక వేధింపుల నివారణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిడ్స్ వ్యాధి సోకిందనీ తెలిసీ వివాహానికి సిద్ధమయ్యాడు.. తర్వాత ఏం జరిగింది?