Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలాంటి దారుణం ఎక్కడైనా మీరు చూశారా? యువకుడిని శవపేటికలో బలవంతంగా పడుకోబెట్టి... (వీడియో)

ఇలాంటి దారుణం మీరు ఎక్కడైనా.. ఎపుడైనా చూసివుండరు. వినివుండరు. ఇది జాత్యాహంకారానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాల పాటు జాతివివక్షతో అట్టుడికిపోయిన దక్షిణాఫ్రికాలో ఈ జాత్యాహంకారం మరోసారి బుస

Advertiesment
ఇలాంటి దారుణం ఎక్కడైనా మీరు చూశారా? యువకుడిని శవపేటికలో బలవంతంగా పడుకోబెట్టి... (వీడియో)
, మంగళవారం, 8 నవంబరు 2016 (17:44 IST)
ఇలాంటి దారుణం మీరు ఎక్కడైనా.. ఎపుడైనా చూసివుండరు. వినివుండరు. ఇది జాత్యాహంకారానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాల పాటు జాతివివక్షతో అట్టుడికిపోయిన దక్షిణాఫ్రికాలో ఈ జాత్యాహంకారం మరోసారి బుసలు కొడుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. 
 
ఆ నల్లజాతీయ వ్యక్తి.. ఏం నేరం చేశాడో తెలియదుకానీ... ఆ వ్యక్తిని సజీవంగా సేవపేటికలో కాల్చేందుకు ఇద్దరు జాతీయులు ప్రయత్నించారు. ఈ ఘటన జాత్యాహంకారానికి పరాకష్టగా నిలిచింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 
 
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను వీక్షిస్తే... ఇద్దరు తెల్లజాతీయులు ఓ నల్లజాతి యువకుడిని శవపేటికలో బలవంతంగా పడుకోబెట్టారు. శవపేటికలో నుంచి బయటకు వచ్చేందుకు నల్లజాతి యువకుడు ప్రయత్నాన్ని తెల్లజాతీయులు అడ్డుకుంటున్నారు. 
 
ఒకరు శవపేటికను మూసేందుకు ప్రయత్నిస్తుండగా, పక్కనే ఉన్న మరో తెల్లజాతీయుడు శవపేటికలోకి పామును పంపిస్తానని, పెట్రలో పోసి తగులబెతానని బెదిరిస్తున్నాడు. వీడియో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. 1996 అనంతరం దక్షిణాఫ్రికాలో ఎప్పుడూ లేనివిధంగా జాత్యాహంకార దాడుల ఫిర్యాదులు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందమైన వరుడుకి వధువు కావాలి : వైరల్‌గా మారిన కేరళ యువకుడి పెళ్లి ప్రకటన.. ఎందుకు?