గెరిట్ తుపాను యూకే, ఐర్లాండ్‌లను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో విమాన ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా ఈదురు గాలుల ప్రభావంతో ల్యాండింగ్ సమయంలో ఓ విమానం ప్రమాదకరంగా ఊగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సంఘటన డిసెంబర్ 27న జరిగింది. లాస్ ఏంజిల్స్ నుండి అమెరికన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానం అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా బలమైన గాలుల కారణంగా విమానం ఊగిసలాడింది.
విమానం రెక్క ఒకవైపుకు వంగి దాదాపు భూమిని తాకింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గెరిట్ తుఫాను కారణంగా UK, గ్లాస్గోలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బ్రిటిష్ ఎయిర్‌వేస్ 13కి పైగా విమానాలను రద్దు చేసింది. బార్సిలోనా- బెర్లిన్ వంటి యూరోపియన్ నగరాలకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. స్కాట్లాండ్‌లో పలు రైళ్లను కూడా రద్దు చేశారు.