Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదేపదే బాత్‌రూమ్‌కు వెళుతున్నారా.. అయితే మీరు బుక్ అయినట్లే!

చౌకగా వస్తువుల్ని తయారుచేయడంలో నిష్ణాతులైన చైనీయులు చోరకళలోనూ ఆరితేరిపోయారనడానికి తాజా ఉదాహరణ ఇది. గత కొద్దికాలంగా బీజింగ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌లో టాయిలెట్‌ పేపర్లు మాయమవుతున్నాయట. ఎంట్రా అని ఆరాతీస్తే చుట్టుపక్కల ఉండే స

పదేపదే బాత్‌రూమ్‌కు వెళుతున్నారా.. అయితే మీరు బుక్ అయినట్లే!
హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (00:17 IST)
చౌకగా వస్తువుల్ని తయారుచేయడంలో నిష్ణాతులైన చైనీయులు చోరకళలోనూ ఆరితేరిపోయారనడానికి తాజా ఉదాహరణ ఇది. గత కొద్దికాలంగా బీజింగ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌లో టాయిలెట్‌ పేపర్లు మాయమవుతున్నాయట. ఎంట్రా అని ఆరాతీస్తే చుట్టుపక్కల ఉండే స్థానికులే వాటిని ఇంట్లో వాడుకోవడానికి ఎత్తుకెళ్లిపోతున్నారని తెలిసింది. దీంతో కంగుతున్న అధికారులు వెంటనే ముఖాల్ని గుర్తించి టాయిలెట్‌ పేపర్‌ను జారీ చేసే యంత్రాన్ని అమర్చారు.
 
బాత్రూమ్‌కు వెళ్లేవారు ముందుగా ఈ మెషీన్‌లోని హెచ్‌డీ కెమెరా ముందు ఫొటో దిగాలి. అప్పుడే టాయిలెట్‌ పేపర్‌ బయటకు వస్తుంది. కెమెరాలో అమర్చిన సాఫ్ట్‌వేర్‌ ముఖాలను నిర్ణీత సమయం వరకూ గుర్తుపెట్టుకుంటుంది. ఒకసారి వచ్చిన వాళ్లు మళ్లీమళ్లీ బాత్రూమ్‌కు వస్తే వారిని కెమెరా గుర్తించి టాయిలెట్‌ పేపర్‌ను జారీ చేయదు. 
 
ఈ తతంగానికి కనీసం 3 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకూ సమయం పడుతుందట. ఈ దొంగతనాలపై స్థానిక మీడియా చేసిన పరిశోధనలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. టాయిలెట్‌ పేపర్లను దొంగలించేవారిలో వృద్ధులే అధికమట. మరోవైపు అధికారుల నిర్ణయానికి సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంతానం కలగలేదని.. భార్యను పుట్టింటికి పంపించి రెండో పెళ్లి చేసుకున్నాడు..