Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చుప్.. బే... నోర్మూసుకుని కూర్చో... మసూద్ అజహర్‌కు వార్నింగ్ ఇచ్చిన నవాజ్ షరీఫ్

భారత్‌లో ఉగ్రదాడులు జరుపుతూ అశాంతికి దారితీయాలన్న నిత్యం కుట్రలు పనున్నతున్న జైషే-ఇ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌కు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు వార

Advertiesment
Pakistan PM Nawaz Sharif
, శనివారం, 1 అక్టోబరు 2016 (08:41 IST)
భారత్‌లో ఉగ్రదాడులు జరుపుతూ అశాంతికి దారితీయాలన్న నిత్యం కుట్రలు పనున్నతున్న జైషే-ఇ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌కు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మీరు చేసిన వెధవపనుల వల్లే పాకిస్థాన్ ప్రపంచంలో ఏకాకిగా మారుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వినికిడి. 
 
నిజానికి భారత అంటే మసూద్ అజహర్ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. అంతెత్తున ఎగిరిపడుతాడు. ఉన్నఫళంగా భారత్ వెళ్లి దొరికినంత మందిని చంపేయాలని, లేదా భారత సైన్యం చేతిలో చావాలన్నంత ఆవేశంతో ఉన్నాడు. అతను అంతలా రగిలిపోవడం వెనుక కారణం లేకపోలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత ఆర్మీ చేసిన మెరుపుదాడిలో హతమైన ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది జైషే-ఇ-మహ్మద్‌కు చెందిన యువకులు ఉండటంతో అజహర్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.  
 
అందుకే భారత్‌లో మారణకాండ సృష్టిస్తామని, తాము జరిపే దాడులను ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా, భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో తన ప్రసంగాలతో కాశ్మీరీ ముస్లిలను రెచ్చగొట్టి భారత్‌‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్నాడు. అతని ఆలోచనలకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అడ్డుతగిలాడు. ఎందుకంటే పాక్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని వాదిస్తోంది. ఇప్పుడు మసూద్ అజహర్ నోరిప్పితే తమ డ్రామా బట్టబయలవుతుంది. దీంతో పాకిస్థాన్‌లో ఆర్మీ తిరుగుబాటుతో సహా, ప్రజావ్యతిరేకత కూడా పెరుగుతుంది. 
 
ఇక ఇదే సమయంలో వచ్చే నవంబరు నెలలో పాక్ ఆర్మీ చీఫ్ రిటైర్ కానున్నాడు. దీంతో ఆయన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు కేసులున్న మసూద్ అజహర్‌కు తీవ్ర హెచ్చరికలు చేసి, ప్రభుత్వం అతనిని అదుపులో ఉంచింది. అంతకంటే ముందు ఈ మూడు ఉగ్రవాద సంస్థలు ఏర్పాటు చేసిన (ఇండియన్ ఆర్మీ చంపేసిన) శిబిరాల్లో ఉగ్రవాదుల ఆనవాళ్లు లేకుండా చేసింది. తద్వారా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, వారంతా భారత్‌కు వెళ్లిపోయారనే భ్రమ కల్పించింది. ఈ కారణంగా భారత్ అంటేనే రగిలిపోయే ఉగ్రవాద సంస్థ నేత నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాంగ్‌స్టర్ నయీమ్ మహాముదురు.. చోటా రాజన్, దావూద్‌ల కంటే మించిపోయాడు..