Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రొట్టెలు గుండ్రంగా తయారుచేయలేదనీ కుమార్తెను హత్య చేసిన కిరాతక తండ్రి

కన్న కూతురిని అత్యంత అమానుషంగా హత్యచేశాడు ఓ దుర్మార్గుడు. రొట్టె గుండ్రంగా తయారు చేయలేదన్న చిన్న కారణంతో కన్నబిడ్డ అనే కనికరం కూడా లేకుండా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది.

రొట్టెలు గుండ్రంగా తయారుచేయలేదనీ కుమార్తెను హత్య చేసిన కిరాతక తండ్రి
, గురువారం, 27 అక్టోబరు 2016 (09:28 IST)
కన్న కూతురిని అత్యంత అమానుషంగా హత్యచేశాడు ఓ దుర్మార్గుడు. రొట్టె గుండ్రంగా తయారు చేయలేదన్న చిన్న కారణంతో కన్నబిడ్డ అనే కనికరం కూడా లేకుండా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. లాహోర్‌కు చెందిన ఖాలీల్ మహ్మద్ అనే వ్యక్తికి అనీక్వీని అనే కుమార్తె ఉంది. ఓ రోజున రొట్టెలు తయారు చేయాలని కుమార్తెను కోరాడు. దీంతో ఆమె తనకు తెలిసిన విధంగా రొట్టెలు తయారు చేసింది. వీటిని చూసిన మహ్మద్‌కు కోపం కట్టలు తెంచుకుంది. 
 
అంతే ఒక్కసారి నిగ్రహం కోల్పోయిన మహ్మద్.. అత్యంత కిరాతకంగా ఆమెను చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని బయట చెత్తకుప్పలో పడేశాడు. అనంతరం ఏమాత్రం భయపడకుండా కూతురు కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు విచారణ చేపట్టిన లాహోర్ పోలీసులు... తండ్రే కూతురిని చంపేశాడని తేల్చింది. ఆ తర్వాత ఈ కేసును విచారించిన లాహోర్ కోర్టు... ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలి కూతురి పెళ్లి.. కత్రినా, షారూఖ్, ప్రభుదేవా డ్యాన్స్.. మోడీ, బాబు, వెంకయ్యలకు పిలుపు..