బీజింగ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రెండో సారి పాజిటివ్ కేసులు బయటపడటంతో.. సుమారు 1255 విమానాలను రద్దు చేసింది. ఆ నగరానికి చెందిన రెండు విమానాశ్రయాలు మూతపడ్డాయి. దీంతో బీజింగ్‌లో దాదాపు 70 శాతం విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి. బీజింగ్‌లో తాజాగా ఓ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఫెంగ్‌టాయి జిల్లాలో ఉన్న జిన్‌ఫాడి మార్కెట్ నుంచి అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రైమరీ, హైయర్ స్కూళ్ల విద్యార్థులు క్యాంపస్‌కు రావద్దు అని ఆదేశించింది. కాలేజీ విద్యార్థులు కూడా క్యాంపస్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. దీంతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని.. మూడవ స్థాయి నుంచి రెండవ స్థాయికి ప్రకటించారు.
గత ఐదు రోజుల్లోనే ఆ నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. ఒకవేళ అత్యవసం అనుకుంటే తప్ప, బీజింగ్ ప్రజలు ఎవరూ తమ ఇళ్లు దాటి బయటకు వెళ్లకూడదని ఆ నగర మున్సిపల్ అధికారి చెన్ బీయి చెప్పారు.