Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జపాన్‌లో కరోనా కొత్త వర్షన్‌!

జపాన్‌లో కరోనా కొత్త వర్షన్‌!
, సోమవారం, 11 జనవరి 2021 (13:02 IST)
జపాన్‌ దేశంలోనూ వైరస్‌ కొత్త వెర్షన్‌ రూపం మార్చుకుని దాడి చేయడం మొదలుపెట్టింది. దీంతో జపాన్‌లో కలకలం రేగింది. నిన్న మొన్నటి దాకా బ్రిటన్‌, అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వైరస్‌ కొత్త వెర్షన్‌లో వెలుగులోకి వచ్చింది. 

జపాన్‌లో వెలుగులోకి వచ్చిన వైరస్‌ అమెరికా, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల వైరస్‌ కన్నా భిన్నంగా ఉందని అక్కడి వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ వైరస్‌ను బ్రెజిల్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో గుర్తించినట్లు వివరణ ఇచ్చింది. ఈ ఇద్దరికి మొదట ఎలాంటి లక్షణాలు లేవు. కొన్ని రోజులకు వీరిలో ఒకరికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడడంతో ఆస్పత్రిలో చేరాడు.

అక్కడ పరీక్షలు చేయగా ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చిందని నిర్ధారించారు. అనంతరం రెండో వ్యక్తికి జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. దీంతో జపాన్‌ ప్రభుత్వం అప్రమత్తమై వారికి ప్రత్యేక వైద్యం అందిస్తోంది. ఈ వైరస్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని శాస్త్రవేత్తలు, వైద్యులను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది.
 
జపాన్‌లో ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం వైరస్‌ కేసులు 30 వరకు ఉన్నాయి. 2,80 వేల కేసులు నమోదవగా, 4 వేల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితి విధించారు. దీని ప్రభావం ఒలంపిక్స్‌ గేమ్స్‌పై పడే అవకాశం ఉంది. క్రీడా సంబరాలను వాయిదా.. లేక రద్దు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జర భద్రం!..పోలీసుల హెచ్చరిక