Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా అమ్మతో నెహ్రూ అనుబంధాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు: పమేలా బాటన్

భారత దేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినాకు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు మధ్య ఉన్న అనుబంధం హద్దులు దాటి సాగిందంటూ గత 60 ఏళ్లుగా సాగుతున్న ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా సాహితీ

Advertiesment
Jawaharlal Nehru
హైదరాబాద్ , సోమవారం, 31 జులై 2017 (04:38 IST)
భారత దేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినాకు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు మధ్య ఉన్న అనుబంధం హద్దులు దాటి సాగిందంటూ గత 60 ఏళ్లుగా సాగుతున్న ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా సాహితీవర్గాల్లో ఒక సంచలనంగా మారింది. కానీ తన అమ్మకు, నెహ్రూజీకి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదే కానీ శారీకరమైనది కాదని ఇన్నేళ్ల తర్వాత ఎడ్వినా కుమార్తె పమేలా హిక్స్‌నీ మౌంట్ బాటన్ తేల్చి చెప్పారు. మౌంట్‌బాటన్‌తో పాటు 17 ఏళ్ల వయసులో పమేలా భారత్‌కు వచ్చారు. ఆమె ఈ విషయం మీదే రాసిన ‘డాటర్‌ ఆఫ్‌ యాన్‌ ఎంపైర్‌ లైఫ్‌ యాజ్‌ ఎ మౌంట్‌బాటన్‌’ అనే పుస్తకంలో వీరి అనుబంధంపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నించారు. 
 
‘నెహ్రూ, ఎడ్వీనాల మధ్య అద్భుత అనుబంధం, పరస్పర గౌరవాభిమానాలు ఉండేవి కానీ.. అందరూ అనుకున్నట్లు వారిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. నిజానికి అందుకు అవసరమైన ఏకాంతమూ వారికి లభించే పరిస్థితి లేదు. వారి చుట్టూ ఎప్పుడూ సిబ్బంది, పోలీసుల ఎవరో ఒకరు ఉండేవారు’ అని పమేలా  పుస్తకంలో వివరించారు. "నెహ్రూ, అమ్మ (ఎడ్వీనా)ల మధ్య ఉన్న వాస్తవ సంబంధమేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకూ ఉండేది. అయితే, నెహ్రూ రాసిన లేఖల్లో ఆమ్మ గురించి ఆయన భావనలు చదివాక  వారిమధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నా. తాను కోరుకున్న వ్యక్తిత్వం, మేధస్సును అమ్మ పండిట్‌జీలో చూసింది’ అని పేర్కొన్నారు.  
 
భారత్‌ నుంచి వెళ్లిపోయేముందు తనకిష్టమైన ఎమరాల్డ్‌ ఉంగరాన్ని నెహ్రూకివ్వాలని ఎడ్వీనా అనుకుందని, నెహ్రూ అందుకు అంగీకరించరని తెలిసి, ఆ ఉంగరాన్ని ఆయన కూతురు ఇందిరకు ఇచ్చిందని పమేలా తెలిపారు. భారత తొలి ప్రధాని నెహ్రూతో తన అమ్మ ఎడ్వినాకు ఏర్పడిన సంబంధం మేధో సంబంధమే తప్ప మరేమీ కాదని పమేలా ఇన్నేళ్ల తర్వాత పేర్కొనడం కొత్త చర్చకు దారితీయక తప్పదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్లు వేస్తే గుండు కొడతారు జాగ్రత్త. వీటిలో మాత్రం వేయొచ్చు