Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Skull Discovered on Mars: అంగారక గ్రహంపై మానవ పుర్రె లాంటి రాయి

Advertiesment
Skull Discovered on Mars

సెల్వి

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (10:24 IST)
Skull Discovered on Mars
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) నిర్వహిస్తున్న పెర్సెవరెన్స్ రోవర్, అంగారక గ్రహంపై మానవ పుర్రెను పోలి ఉండే ఒక విచిత్రమైన రాతి నిర్మాణాన్ని గుర్తించింది. ఈ అసాధారణ ఆకారంలో ఉన్న శిల చిత్రాన్ని రోవర్ భూమికి ప్రసారం చేసింది. దీనితో శాస్త్రవేత్తలు దీనికి "స్కల్ హిల్" అని పేరు పెట్టారు. 
 
నాసా రోవర్ ప్రస్తుతం అంగారక గ్రహంపై జెజెరో క్రేటర్ అంచున పరిశోధనలు నిర్వహిస్తోంది. ఏప్రిల్ 11న, రోవర్ యొక్క అధిక శక్తితో కూడిన మాస్ట్‌క్యామ్-జెడ్ కెమెరా దాని పరిసరాల నుండి స్పష్టంగా కనిపించే శిల  చిత్రాన్ని సంగ్రహించింది. సమీపంలోని ఇతర రాళ్ళు, నేల లేత రంగులో ఉన్నప్పటికీ, ఈ ప్రత్యేకమైన రాతి ముదురు రంగులో, చిన్న గుంటలతో కప్పబడి ఉంటుంది, 
 
ఇది మానవ పుర్రెను పోలి ఉండటం వల్ల, నాసా శాస్త్రవేత్తలు ఆ శిలను "స్కల్ హిల్" అని పిలిచారు. అయితే, శిల ఏర్పడిన ఖచ్చితమైన ప్రక్రియ అస్పష్టంగానే ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు