Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరణార్థులపై ఆంక్షలు కాదు ఉగ్రవాదులకోసం కారుస్తున్న కన్నీళ్లే అసలు సమస్య: గయ్ మన్న ట్రంప్

వివాదాస్పదమైన వలస నిరోధక ఆదేశంపై యావత్ ప్రపంచం మండిపడుతుండగా లైట్ తీసుకోండంటూ అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హితవు పలికాడు. ఇరాక్ దేశీయులను అమెరికాలోకి రానివ్వకుండా గతంలో ఆరునెలల పాటు ఒబామా బరాక్ డిక్రీ జారీ చేశారని, ఆయన చేసిందే తాను అనుసరిస

Advertiesment
శరణార్థులపై ఆంక్షలు కాదు ఉగ్రవాదులకోసం కారుస్తున్న కన్నీళ్లే అసలు సమస్య: గయ్ మన్న ట్రంప్
హైదరాబాద్ , మంగళవారం, 31 జనవరి 2017 (01:20 IST)
వివాదాస్పదమైన వలస నిరోధక ఆదేశంపై యావత్ ప్రపంచం మండిపడుతుండగా లైట్ తీసుకోండంటూ అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హితవు పలికాడు. ఇరాక్ దేశీయులను అమెరికాలోకి రానివ్వకుండా గతంలో ఆరునెలల పాటు ఒబామా బరాక్ డిక్రీ జారీ చేశారని, ఆయన చేసిందే తాను అనుసరిస్తూంటే నామీద  విరుచుకుపడతారేంటీ అని ట్రంప్ ఎదురు ప్రశ్నించారు. పైగా ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించక ముందే వారికోసం గాలింపు జరపటం నాజూకుగా ఉండదు కదా అంటూ తన ఆదేశాన్ని సమర్థించుకున్నారు.
 
ఏడు ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి రానివ్వకుండా ట్రంప్ విధించిన ఆంక్షలను న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కోవడానికి అమెరికా పౌర హక్కుల బృందాలు, పౌరులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన నేపథ్యంలో సోమవారం ట్రంప్ అటు రాజీపూర్వకంగానూ, మరోవైపు సంఘర్షణాయుతంగాను స్పందించారు.
 
తన పూర్వ అధ్యక్షుడు బరాక్ ఒబామా గతంలో ఇరాకీ శరణార్థులను ఆరు నెలలపాటు అమెరికాలో ప్రవేశించనీకుండా అడ్డుకున్నారని, తన పాలసీ కూడా అదేనని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. శరణార్థుల వివరాలపై సమీక్ష ముగియగానే అన్ని దేశాల పౌరులకు మునుపటిలాగే వీసాలు, ప్రయాణ అనుమతులను మంజూరు చేస్తామన్నారు.
 
వలస ప్రజలను తొలినుంచి ఆహ్వానించిన గొప్ప దేశం అమెరికాయేనని, అణచివేతను ఎదుర్కొంటున్న వారిపట్ల అమెరికా ఇప్పటికీ సానుభూతి కలిగి ఉంటుందని, అయితే మా పౌరులను, సరిహద్దులను కాపాడుకోవడం కూడా మాకు ముఖ్యమేనని ట్రంప్ వక్కాణించారు.
 
అయితే 24 గంటలు కాకముందే ట్రంప్ తన పూర్వ ప్రకటనకు భిన్నంగా  మాట్లాడారు. చాలామంది చెబుతున్నట్లుగా ఒక వారం నోటీసు యిచ్చి తర్వాత శరణార్థులపై నిషేధం ప్రకటించి ఉంటే దుష్టులు దేశంలోకి జొరబడేవారని, శరణార్థుల్లో దుష్టశక్తులు అనేకం ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. 
 
శరణార్థుల ఆగమనాన్ని అడ్డుకున్న తన ఆంక్షలను వ్యతిరేకిస్తూ చట్టం తీసుకొస్తామని డెమాక్రాటిక్ పార్టీ నేత చుక్ ష్కూమర్ ప్రతిజ్ఞ చేయడాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. అమెరికాకు వచ్చిన 325,000 మంది శరణార్థుల్లో 109 మందిని మాత్రమే నిర్బంధించామని, వీరిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. వాస్తవానికి శరణార్థుల తరపున నిరనసకారులు, సెనేటర్ ష్కూమర్ కారుస్తున్న కన్నీళ్లే అసలు సమస్య అని ట్రంప్ ఎద్దేవా చేశారు. 
 
శరణార్థులపై ఆంక్షలు విధించినందుకు అమెరికా స్వేచ్ఛా ప్రతిమ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నీళ్లు కారుస్తోందని సెనెటర్ ష్కూమర్ వ్యాఖ్యానించిన నేపధ్యంలో ట్రంప్ కన్నీళ్లే అసలు సమస్య అనేశారు. అమెరికాను మరోసారి సురక్షితంగా ఉంచడమే తన విధి అన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముస్లింలను ఒక్కతాటికి వచ్చేలా చేసిన ట్రంప్ మహాశయా నీకు జోహార్లంటున్న జిహాదీలు