Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలిని గర్భవతిని చేసి.. ఆమె తల్లితో లేచిపోయాడు..

Advertiesment
Mother in Law
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (20:31 IST)
ప్రియురాలితో ప్రేమ కలాపాలు సాగించి ఆమెను గర్భవతిని చేసి, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె తల్లితో లేచిపోయాడో ప్రియుడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని గ్లౌస్‌స్టర్‌షైన్‌కు చెందిన జెస్‌ అల్‌డ్రిడ్జ్‌ (24), అదే ప్రాంతానికి చెందిన రియాన్‌ షెల్టన్‌ (29) అనే యువతితో కొన్నాళ్లుగా లవ్ ఎఫైర్ నడిపాడు.
 
ఆమెతో సన్నిహితంగా గడపటంతో ఆమె గర్భం దాల్చింది. అదే సమయంలో రియాన్ తల్లి జార్జినాతోకూడా అల్ డ్రిడ్జ్ ప్రేమాయణం నడిపాడు. రాత్రిళ్లు ఇద్దరూ కిచెన్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ బకార్డి తాగేవారు.
 
వీరి ప్రవర్తపై అనుమానం వచ్చిన రియాన్ ఒకరోజు వీరిద్దరినీ నిలదీసింది. అబ్బే అదేం లేదని బుకాయించారు. రియాన్ కు తెలియకుండా అల్ డ్రిడ్జ్, జార్జినా కలుసుకోవటం మొదలెట్టారు. కొన్నాళ్లకు ఈ విషయం రియాన్‌కు తెలిసినా ఏమీ చేయలేకపోయింది. ఆమె కడుపుతో ఉండి ఇంట్లోనే ఉండటంతో వీరిద్దరూ బయట కలుసుకునే వాళ్లు ఇలా ఉండగా జనవరి 28న జెస్‌ అల్‌డ్రిడ్జ్‌, రియాన్‌ల ప్రేమకు గుర్తుగా పండంటి బాబు పుట్టాడు.
 
రియాన్ కు ఆ సంతోషం ఎక్కువ సేపు నిలబడలేదు కారణం తన బిడ్డకు తండ్రి అయిన జెస్‌ అల్‌డ్రిడ్జ్, తనకు బ్రేక్ అప్ చెప్పి తన తల్లి జార్జినాతో లేచిపోయాడు అని తెలుసుకుని షాక్‌కు గురయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్తకాగితాలు ఏరుకుని చంద్రబాబు వెళ్ళడం నేను చూడాలి: నారాయణస్వామి