తిరుగులేని వ్యాపారవేత్త, వజ్రాల వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. ఎంత తిన్నా తరగని ఆస్తి. ఇంటి నిండా పనివాళ్లు, కావలసినన్ని కార్లు, బంగళాలు. కోరింది దక్కించుకునే సామర్థ్యం. ఇవన్నీ అతనికి సంతృప్తి ఇవ్వలేదు. ఇన్ని ఉన్నా ఏదో వెలితి. దానికి కారణం అతని మగతనం.
అతని అంగం చిన్నదిగా ఉండటంతో ఎప్పుడూ బాధపడుతుండేవాడు. మగతనాన్ని పెంచుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకున్నాడు. ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధపడ్డాడు. చివరికి అదే అతని ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది.
బెల్జియం దేశానికి చెందిన ఎహుడ్ ఆర్యే లానియాడో (65) తిరుగులేని వజ్రాల వ్యాపార వేత్త. అంగం పెంచుకోవడానికి శస్త్ర చికిత్స కోసం ఫ్రాన్స్‌లోని పారిస్‌కి చేరుకున్నాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా గుండెపోటు వచ్చి మరణించాడు. ఆపరేషన్‌కి ముందు అతనికి ఓ ఇంజక్షన్ ఇచ్చారు. అది వికటించి ఓత్తిడికి గురైన ఎహుడ్ ఆర్యేకి వైద్యులు కృత్రిమ శ్వాస అందించడానికి ప్రయత్నించారు.
అయినా ఊపిరి అడక గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. పన్ను ఎగవేతలో కూడా ఇతను ఆరోపణలు ఎదుర్కొన్నాడు. టాక్స్ ఎగ్గొట్టినందుకు బెల్జియం ప్రభుత్వం గతేడాది ఇతనికి 4 బిలియన్ యూరోలు (దాదాపు 31 వేల కోట్ల రూపాయలు) జరిమానా విధించింది.