భార్యకి కడుపు రాలేదని పక్కింటి వ్యక్తిపై కేసు పెట్టిన భర్త.. ఎక్కడ?
తన భార్యకి కడుపు రావట్లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు ఓ భర్త. ఈ విచిత్ర ఘటన వివరాలను పరిశీలిస్తే.... తన భార్యకి గర్భం రాలేదు అని సౌపోలోస్ అనే భర్త తన పక్కింటి వాడి మీద కేసు పెట్టడం దుమారం రేపుతో
తన భార్యకి కడుపు రావట్లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు ఓ భర్త. ఈ విచిత్ర ఘటన వివరాలను పరిశీలిస్తే.... తన భార్యకి గర్భం రాలేదు అని సౌపోలోస్ అనే భర్త తన పక్కింటి వాడి మీద కేసు పెట్టడం దుమారం రేపుతోంది. సేఫ్టీ గేట్ కోర్టు విచారిస్తున్న ఈ వింత కేసులో తన భార్యను గర్భవతిని చేయడంలో పక్కింటి 29 ఏళ్ల వ్యక్తి విఫలమయ్యాడంటూ భర్త అతడిని కోర్టుకు లాగాడు. తన భార్యని గర్భవతిని చెయ్యడం కోసం 2500 డాలర్లు చెల్లించానని.... కానీ అందుకు తగ్గ ఫలితం దక్కలేదని కేసు పెట్టాడు.
సౌపోలోస్ భార్య మాజీ బ్యూటీ క్వీన్, మోడల్. ఈ దంపతులకు పిల్లలు పుట్టరని వైద్యులు పరీక్షించి సౌపోలోస్‌కు చెప్పారు. ఇక్కడే సౌపోలోస్‌కు ఒక వింత ఆలోచన కలిగింది. భార్యకి గర్భం రావడం కోసం పక్కింటి అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు భర్త. ఆరు నెలల్లో వారానికి మూడు రోజుల చొప్పున సెక్స్‌లో పాల్గొనాలని మొత్తం డెబ్భై రెండు ప్రయత్నాల్లో ఖచ్చితంగా గర్భవతిని చేయాలని కండీషన్ పెట్టాడు.
డబ్బు తీసుకుని కూడా తన భార్యని గర్భవతిని చెయ్యలేక పోయాడు అని కోపంగా కోర్టుని ఆశ్రయించాడు భర్త. ఈ కేసును పరిశీలించిన కోర్టు జడ్జితో సహా అందరూ అవాక్కయ్యారు. మరి కోర్టు ఆ భర్తకు న్యాయం చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.