Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ్ముడిని గదిలోకి తీసుకెళ్లి అక్క దారుణానికి పాల్పడింది.. వాటిని కోసి తినేసింది..

Advertiesment
తమ్ముడిని గదిలోకి తీసుకెళ్లి అక్క దారుణానికి పాల్పడింది.. వాటిని కోసి తినేసింది..
, మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:23 IST)
ప్రపంచం సాంకేతిక రంగంలో కొత్త పుంతలు తొక్కుతుంటే..కొందరు మాత్రం క్షుద్రపూజలతో అభంశుభం తెలియని చిన్నారులను బలి తీసుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వస్తున్న ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు అంటూ అమాయకులను పొట్టనపెట్టుకుంటున్నారు. మానవాతీత శక్తులు పొందాలనే కోరికతో ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. 
 
సొంత తమ్ముడు అనే జాలి కూడా లేకుండా ఘోరంగా చంపేసి అతని మర్మాంగాలను కోసుకుని తినేసింది. బ్రెజిల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ తన కూతురు, కొడుకుతో కలిసి నివాసముంటుంది. 18 ఏళ్ల కూతురుకి చిన్నతనం నుంచి క్షుద్రపూజలంటే ఎంతో ఆసక్తి. మానవాతీత శక్తులు పొందాలని ఎంతో ఆసక్తిగా వీడియోలు చూసేది. వయస్సుతో పాటు తనలో మూఢనమ్మకాలు కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో ఓ రోజు తల్లి మార్కెట్‌కు వెళుతూ 5 ఏళ్ల తమ్ముడిని చూసుకోమని చెప్పింది. తమ్ముడితో ఆడుతున్న సమయంలో ఆమెలో దాగివున్న మూఢనమ్మకం నిద్రలేచింది. దీంతో తమ్ముడిని వీడియో గేమ్ ఆడదామని తన బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లింది. గదిలోకి తీసుకెళ్లి, తమ్ముడిని దిండుతో ఊపిరాడనివ్వకుండా చంపేసింది. తర్వాత అతడి మర్మాంగాలను కోసుకుని తినేసింది. తమ్ముడి శవం చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి మధ్యలో కూర్చొని పూజలు చేసింది.
 
ఇంతలో మార్కెట్ నుండి తిరిగివచ్చిన తల్లి లోపల కనిపించిన దృశ్యాలను చూసి షాకైంది. స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గదిలో డ్రగ్స్ దొరకడంతో డ్రగ్స్ మత్తులో ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పంలో ప్రత్యక్షంగా నామినేషన్‌ వేయలేదు.. ప్రచారం చేయనూ లేదు.. అదెలా సాధ్యం?