Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై త్వరలోనే తుది నిర్ణయం : పాక్

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష పిటిషన్‌పై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని పాకిస్థాన్ ఆర్మీ స్పష్టం చేసింది. గూఢచర్యం ఆరోపణలపై 46 ఏ

Advertiesment
కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై త్వరలోనే తుది నిర్ణయం : పాక్
, శుక్రవారం, 6 అక్టోబరు 2017 (08:48 IST)
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష పిటిషన్‌పై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని పాకిస్థాన్ ఆర్మీ స్పష్టం చేసింది. గూఢచర్యం ఆరోపణలపై 46 ఏళ్ల జాదవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించింది. 
 
కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష పిటిషన్ ఆర్మీ చీఫ్‌కు అందిందని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని, ఏ నిర్ణయం తీసుకునేది త్వరలోనే తెలియపరుస్తామని ఆయన పేర్కొన్నారు.
 
తనకు విధించిన మరణశిక్షపై జాదవ్ పెట్టుకున్న పిటిషన్‌ను అప్పిలేట్ కోర్టు కొట్టివేయడంతో ఆయన పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆశ్రయించారు. అక్కడి చట్టాల ప్రకారం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్)కు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయన కూడా దానిని కొట్టివేస్తే పాక్ అధ్యక్షుడిని ఆశ్రయించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ డోక్లాం రచ్చం.. సైనికుల గస్తీ మధ్య రహదారి విస్తరణ పనులు