Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇరాన్‌లో దారుణం... ఆడపిల్లలకు విషపు ఇంజెక్షన్లు

iran girls
, సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (18:09 IST)
ముస్లిం దేశాల్లో ఒకటైన ఇరాన్‌లో తాజాగా దారుణం ఒకటి వెలుగు చూసింది. ఈ దేశంలోని కొందరు మతఛాందసవాదులు, సంఘ విద్రోహ శక్తులు కొందరికి ఆడపిల్లలు చదువుకోవడం సుతరామా ఇష్టం లేదు. దీంతో వారు ఆడపిల్లలే లక్ష్యంగా విష ప్రయోగం చేస్తున్నారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో కొందరు సంఘ విద్రోహులు ఈ దారుణానికి పాల్పడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
 
టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థినిలు భోజనంలో విషం కలిపారు. దీంతో వందలాది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోలయ్యారు. ఈ విషయాన్ని డిప్యూటీ ఆరోగ్య మంత్రి యూనెస్ పనాహీ ఆదివారం అధికారికంగా వెల్లడించారు. ఈ అమానుషానికి పాల్పడిన వారు బాలికలకు విద్య అవసరం లేదని, అందువల్ల బాలికలు చదువుకునే పాఠశాలలను మూసివేయాలని కోరుతున్నారు. 
 
నిజానికి గత యేడాది నవంబరులోనే ఇలాంటి ఘటనలు జరిగాయి. ఆ నెలలో అనేక మంది విద్యార్థినులు శ్వాస తీసుకోలేక ఆస్పత్రి పాలయ్యారు. తాజాగా జరిగిన జరిగిన ఘటనతో గత నెలలో కూడా విద్యార్థినులపై విష ప్రయోగం జరిగినట్టు భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఈ ఘటన పై ఇరాన్ నిఘా వర్గాలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే. 22 యేళ్ల కుర్దిష్ మహిళ మహ్స అమినీ మరణంతో మొదలైన ఈ నిరసనలు దేశ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్చాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాడిదలు గర్భందాల్చితే సీమంతాలు.. పిల్లలు పుడితే బారసాలాలు కూడా.. ఎక్కడ...!?