Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయులు బద్ధకస్తులైతే.. ఇండోనేషియన్లు మరీ ఓవర్.. కానీ హాంకాంగ్.. ఆ విషయంలో టాప్..

భారతీయులు బద్ధకస్తులేనని.. అధిక దూరం నడవాలంటే బద్ధకంగా వ్యవహరిస్తారని తాజాగా స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ పరిశోధకులు తేల్చారు. స్మార్ట్ ఫోన్స్ యాప్ బిల్టిన్ యాక్సెలెరో మీటర్ ఆధారంగా చేసిన సర్వే ద్వారా భారతీయ

భారతీయులు బద్ధకస్తులైతే.. ఇండోనేషియన్లు మరీ ఓవర్.. కానీ హాంకాంగ్.. ఆ విషయంలో టాప్..
, శుక్రవారం, 14 జులై 2017 (15:26 IST)
భారతీయులు బద్ధకస్తులేనని.. అధిక దూరం నడవాలంటే బద్ధకంగా వ్యవహరిస్తారని తాజాగా స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ పరిశోధకులు తేల్చారు. స్మార్ట్ ఫోన్స్ యాప్ బిల్టిన్ యాక్సెలెరో మీటర్ ఆధారంగా చేసిన సర్వే ద్వారా భారతీయులు నడవాలంటేనే.. బద్ధకంగా ఫీలవుతారని తేలింది. 
 
ప్రపంచంలోని 111 దేశాల యూజర్లకు సంబంధించిన డేటాతో జరిగిన అధ్యయనంలో భారతీయులు సగటున రోజుకు 4,297 అడుగులు వేస్తున్నారని తేల్చారు. వీరు సేకరించిన మొత్తం డేటా ప్రకారం మానవులు సగటున రోజుకు 4,961 అడుగులు వేస్తున్నారు.
 
భారతీయులు మాత్రం 4,500 అడుగులు మాత్రమే వేస్తున్నారని తేలింది. ఇక ఇండోనేషియ‌న్లు రోజుకు 3513 అడుగులు మాత్రమే నడుస్తున్నారు. దీంతో ప్ర‌పంచంలోనే అధిక శాతం మంది బ‌ద్ధ‌క‌స్తులున్న దేశం ఇండోనేషియ‌న్లని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. 
 
ఇక అత్య‌ధిక దూరం నడుస్తూ బ‌ద్ధ‌కం లేద‌నిపించుకున్న దేశంలో హాంకాంగ్ అగ్ర‌స్థానంలో ఉంది. ఆ దేశంలోని వారు సగటున 6,880 అడుగులు వేస్తున్నార‌ని తేలింది. హాంకాంగ్ త‌రువాతి స్థానంలో వ‌రుస‌గా చైనా, ఉక్రెయిన్, జపాన్, రష్యా దేశాలు ఉన్నాయి. జపనీయులు ఆరువేల అడుగులు వేస్తున్నారు. కానీ సౌదీ అరేబియా, ఇండోనేషియా ప్రజలు మాత్రం 3,900 స్టెప్పులు మాత్రమే వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిరణ్ కుమార్ రెడ్డికి జనసేన నుంచి పిలుపు: సెకండ్ ప్లేస్ ఇచ్చేందుకు పవన్ రెడీ?