Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్తాన్ ప్రధాని రాజీనామా చేస్తారా?

Advertiesment
పాకిస్తాన్ ప్రధాని రాజీనామా చేస్తారా?
, గురువారం, 4 మార్చి 2021 (20:08 IST)
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయవచ్చునని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ అసెంబ్లీ (పార్లమెంట్) నుంచి తాను విశ్వాస పరీక్షను కోరుతానని ప్రకటించారు. పైగా సెనేట్ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ ఓడిపోవడంతో ఆయన గౌరవప్రదంగా రాజీనామా చేయాలనీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఆర్మీ చీఫ్, జనరల్ కామర్ జావెద్ బాజ్వా, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఫైజ్ హమీద్ లతో సమావేశమయ్యారు. సెనేట్ ఎన్నికల్లో పాలక పార్టీకి చెందిన అభ్యర్థి అబ్దుల్ హఫీజ్ షేక్.. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూమెంట్ అభ్యర్థి, మాజీ ప్రధాని సయీద్ యూసుఫ్ రజా గిలానీ చేతిలో ఓడిపోయారు. ఈ పార్టీ 11 విపక్షాలతో కూడిన పార్టీ.
 
సెనేట్ ఫలితాలు వెలువడిన వెంటనే పీపీపీ చైర్మన్ బిలాల్ భుట్టో జర్దారీ.. ఇమ్రాన్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. అటు గిలానీని పలువురు ప్రతిపక్ష నేతలు అభినందించారు. గిలానీ గెలుపు గ్లోరియస్ విక్టరీ అని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు.
 
అటు పాకిస్థాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను పలు దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అసలు సెనేట్ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని ఇమ్రాన్ ఖాన్ ఊహించి ఉండరని అంటున్నారు. ఈ రాజకీయ సంక్షోభానికి సంబంధించి నమరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్ హాసనే మా సీఎం అభ్యర్థి.. ప్రకటించిన శరత్ కుమార్