ట్రంప్ పాలనతో హ్యాపీగా లేము.. అమెరికన్లకు ఇదో మేలుకొలుపు: అన్సెల్
హాలీవుడ్ నటుడు అన్సెల్ ఎల్టోర్ట్.. అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ పరిపాలనలో తాము హ్యాపీగా లేమని పెదవి విరిచాడు. అయితే అమెరికన్లకు ఇదో మేలుకొలుపులా ఉంటుందని అభిప్రాయపడ
హాలీవుడ్ నటుడు అన్సెల్ ఎల్టోర్ట్.. అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ పరిపాలనలో తాము హ్యాపీగా లేమని పెదవి విరిచాడు. అయితే అమెరికన్లకు ఇదో మేలుకొలుపులా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. మున్ముందు ఇలాంటి వ్యక్తులు అధ్యక్షులు కాకుండా జాగ్రత్త పడతామన్నాడు. ట్రంప్ అసమర్థుడని, అమెరికన్లకు అవసరమైన విషయాలన్నీ దూరం చేస్తున్నాడని అన్సెల్ పేర్కొన్నాడు.
ప్రజలకు సామాజిక సేవల్ని దూరం చేస్తున్నాడని ఆయన మండిపడ్డాడు. చాలామంది ప్రజలు ఈ అనుభవం నుంచి ఏమీ నేర్చుకోలేకపోతున్నారని, చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారని వెల్లడించారు. మరో పదేళ్లకు ఒబామాలాంటి వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడవుతాడని, ఆ తరువాత మళ్లీ ఇడియట్ లాంటి వ్యక్తి చేతిలోకి దేశం వెళ్లిపోతుందని అన్సెల్ ఆవేదన వ్యక్తం చేశాడు.