గణేషుడుతో గొర్రె మాంసం ప్రమోషన్ (Video)
భారతీయ దేవతామూర్తులను ప్రాశ్చాత్యులు వివిధ రకాలుగా అవమానిస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పలు దేశాల్లో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఆదిదేవుడు వినాయకుడితో గొర్రె మాంసాన్ని ప్రమోట్ చేస్తూ ఓ యాడ్‌ను రూపొంద
భారతీయ దేవతామూర్తులను ప్రాశ్చాత్యులు వివిధ రకాలుగా అవమానిస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పలు దేశాల్లో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఆదిదేవుడు వినాయకుడితో గొర్రె మాంసాన్ని ప్రమోట్ చేస్తూ ఓ యాడ్‌ను రూపొందించారు. ఈ పనికి పాల్పడింది ఆస్ట్రేలియా వ్యాపారులు. దీనిపై హిందూ భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
గొర్రె మాంసాన్ని ప్రమోట్ చేయడం కోసం వినాయకుడిని మీట్ అండ్ లైవ్‌స్టాక్ ఆస్ట్రేలియా (ఎమ్మెల్యే) అనే సంస్థ ఉపయోగించింది. ఈ యాడ్‌ను ఈ నెల 4న ఈ యాడ్‌ను విడుదల చేసింది. ఈ యాడ్‌ను చూసిన హిందువులు మండిపడుతూ ఆ యాడ్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్ బ్యూరోకి పలు హిందూ సంస్థలు ఫిర్యాదు చేశాయి.
అయితే, ఈ యాడ్‌లో గణేషుడే కాదు ఇతర మతాల దేవుళ్లయిన జీసస్, బుద్ధుడు, థోర్, జ్యూస్‌లు కూడా ఉన్నారు. వాళ్లందరినీ ఇందులో నుంచి తొలగించాలని హిందూ సమాజం స్పష్టంచేసింది. ఈ దేవుళ్లంతా ఓ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని గొర్రె మాంసం తింటున్నట్లుగా యాడ్‌ను చిత్రీకరించారు.
గణేషుడిని ఈ యాడ్‌లో వాడటం హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని వారు అంటున్నారు. ఈ యాడ్‌పై అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా ఆ సంస్థ మాత్రం ఈ యాడ్‌పై వెనక్కి తగ్గేది లేదని చెప్పడం గమనార్హం. మత విశ్వాసాలను ఏమీ దెబ్బతీస్తున్నట్లుగా ఈ యాడ్ లేదని, గొర్రె మాంసం అందరినీ ఏకం చేస్తున్నదనే ఉద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సంస్థ మార్కెటింగ్ మేనేజర్ ఆండ్రూ హోవీ చెప్పారు.