Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిల్లరీకి రోగం... అమెరికా అధ్యక్షురాలిగా ఆమె పనికిరాదు... డొనాల్డ్ ట్రంప్ ప్రచారం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించేకొద్దీ హిల్లరీ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ పరస్పరం మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. ఐతే అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రంప్ హవా క్రమంగా తగ్గుతోంది. హిల్లరీ క్లింటన్ ముందుకు దూసుక

Advertiesment
హిల్లరీకి రోగం... అమెరికా అధ్యక్షురాలిగా ఆమె పనికిరాదు... డొనాల్డ్ ట్రంప్ ప్రచారం
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (15:03 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించేకొద్దీ హిల్లరీ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ పరస్పరం మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. ఐతే అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రంప్ హవా క్రమంగా తగ్గుతోంది. హిల్లరీ క్లింటన్ ముందుకు దూసుకువెళుతున్నారు. ఐతే ఆమె హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 9/11 మెమోరియల్ ఈవెంట్లో పాల్గొన్న సమయంలో ఆమె శరీర ఉష్ణోగ్రతలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దానితో ఆమె సిబ్బంది సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
 
ఈ వార్త తెలియగానే రిపబ్లికన్ పార్టీ రెచ్చిపోతోంది. హిల్లరీ రోగాల పుట్ట అనీ, ఆమె అనేక అనారోగ్యాలతో బాధపడుతోందనీ, అలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షురాలిగా ఎలా ఫిట్ అవుతారు.. అంటూ ప్రశ్నిస్తుంది. హిల్లరీ అనారోగ్యానికి గురికావడంపై ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్  ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి మాట్లాడారు. ఆమె అనారోగ్యం ఆమె మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని అంటూ ప్రచారం కూడా చేస్తున్నాడు. 
 
47 శాతం ఓట్లతో అధ్యక్షపదవి రేసులో ముందంజలో ఉన్న హిల్లరీకి ఆమె అనారోగ్యం పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ఆమె న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె వైద్య బృందం తెలిపింది. ఐతే ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ హిల్లరీ క్లింటన్ ట్రంప్ కంటే 7 శాతం అధిక ఓట్లతో ముందంజలో ఉన్నారు. మరి తాజా పరిస్థితులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోదా అడిగితే పవన్ పైన ఎదురు దాడా...? మేమున్నాం... సీపీఐ రామకృష్ణ