Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Trump-Zelenskyy: డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య వాగ్వాదం.. తలపట్టుకున్న ఒక్సానా.. వీడియో వైరల్

Advertiesment
Trump-Zelenskyy

సెల్వి

, శనివారం, 1 మార్చి 2025 (11:06 IST)
Trump-Zelenskyy
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌ భేటీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీ ఇరువురు నేతలు కూడా తగ్గేదే లేదంటూ.. మీడియా ఎదుటే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. వీరి మధ్య చర్చలు రసాభాసగా మారాయి. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్‌స్కీ వైట్ హౌస్ వీడారు. మీడియా ముందే వీరిద్దరి మధ్య వాడీవేడీ చర్చ చోటుచేసుకోవడంతో ఉక్రెయిన్ రాయబారి బక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. 
 
ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య సజావుగానే భేటీ సాగింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చునని.. జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ఆ సమయంలో ఇరు దేశాల రాయబారులు ఎదురుగానే వున్నారు. ట్రంప్ మాటలకు జెలెన్‌స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి అయిన ఒక్సానా గందరగోళానికి గురయ్యారు. ఇంకా తలపట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
రష్యా చేస్తున్న యుద్ధానికి తెర తెంచడానికి శాంతి ఒప్పందం కుదర్చడం దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించేందుకు జెలెన్‌స్కీ శుక్రవారం శ్వేతసౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో చర్చలు అర్థంతరంగా ముగిశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడుతో కలిసి భర్తపై భార్య హత్య యత్నం: ప్రాణాల కోసం పోరాడిన భర్త మృతి