Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తె భర్తతో తల్లి అక్రమ సంబంధం... ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా?

మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా కామంతో కళ్ళుమూసుకుని పోయిన కొందరు వావివరుసలు విస్మరించి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తద్వారా కొందరి జీవితాలు చిన్నభిన్నమైపోతున్నాయి.

Advertiesment
కుమార్తె భర్తతో తల్లి అక్రమ సంబంధం... ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా?
, శనివారం, 30 సెప్టెంబరు 2017 (09:31 IST)
మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా కామంతో కళ్ళుమూసుకుని పోయిన కొందరు వావివరుసలు విస్మరించి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తద్వారా కొందరి జీవితాలు చిన్నభిన్నమైపోతున్నాయి. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సాక్షాత్ కుమార్తె భర్తతోనే తల్లి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని తన భార్యకు భర్తే స్వయంగా చెప్పాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ ఆత్త.. అల్లుడిని చంపేందుకు వేసిన ప్లాన్ విఫలం కావడంతో కటకటాలపాలైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫ్లోరిడాకు చెందిన కేథలీన్ రెజీనా డేవీస్ అనే 58 ఏళ్ల మహిళకు ఓ కుమార్తె ఉంది. ఈమెకు భర్త లేడు. కుమార్తెకు ఓ వ్యక్తితో వివాహం చేసింది. అతన్ని ఇల్లరికం అల్లుడిగా ఉంచుకున్నారు. అతనిపేరు ఏళ్ల మైఖెల్ స్కిర్రా. వయసు 33 యేళ్లు. మైఖెల్‌తో రెజీనా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం కొంతకాలం పాటు గుట్టుచప్పుడు కాకుండానే సాగింది. 
 
అయితే అనుకోని పరిస్థితుల్లో తమ వ్యవహారం గురించి మైఖెల్ తన భార్య హన్నా స్కిర్రాకు తెలియజేశాడు. ఈ విషయం తెలిసిన రెజీనా.. అల్లుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని మట్టుబెట్టేలా ప్లాన్ వేసింది. ఈనెల 20వ తేదీ అల్లుడిపై కోడిగుడ్లతో దాడి చేసింది. కారు అద్దాలను పగలగొట్టింది. దీంతో భయపడిపోయిన అతడు.. ఇంటినుంచి బయటకు పరుగెత్తాడు. అదే అదనుగా భావించిన ఆమె.. అక్కడ ఉన్న కారును తీసుకుని అతడిపైకి తొక్కించాలని ప్రయత్నించింది. 
 
సరిగ్గా అపుడే అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ సిబ్బంది ప్రాణ భయంతో పరుగెడుతున్న మైఖెల్‌ను, రెజీనాను అదుపులోకి తీసుకున్నారు. అత్త చేసిన పనిని పోలీసులకు చెప్పడంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే, తనను భర్త మోసం చేశాడని, విడాకులు ఇప్పించమని కోరుతూ హన్నా కేసు పెట్టింది. మొత్తానికి అత్తా అల్లుడి అక్రమసంబంధం.. ఓ కుటుంబాన్ని నడివీధిలో నిలబెట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది సర్కార్ సృష్టించిన నరమేధం : శివసేన