Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో ఇద్దరు తమిళులకు పాములు పట్టే ఉద్యోగం.. పిలిచి మరీ ఇచ్చారట..

జల్లికట్టు ప్రభావంతో ఏమో కానీ తమిళులకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం లభిస్తోంది. తాజాగా ఇద్దరు తమిళ వ్యక్తులకు అమెరికాలో అనూహ్యంగా పాములు పట్టే ఉద్యోగం లభించింది. ఫ్లోరిడాలో పెద్ద పెద్ద కొండచిలువలను పట్టుక

Advertiesment
Florida enlists snake hunters from India to catch pythons
, శుక్రవారం, 27 జనవరి 2017 (15:38 IST)
జల్లికట్టు ప్రభావంతో ఏమో కానీ తమిళులకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం లభిస్తోంది. తాజాగా ఇద్దరు తమిళ వ్యక్తులకు అమెరికాలో అనూహ్యంగా పాములు పట్టే ఉద్యోగం లభించింది. ఫ్లోరిడాలో పెద్ద పెద్ద  కొండచిలువలను పట్టుకునేందుకు ఫ్లోరిడా అటవీశాఖ అధికారులు తమిళనాడుకు చెందిన ఇద్దరు అనుభవజ్ఞులైన పాములు పట్టేవాళ్లను నియమించుకున్నారు. 
 
కొండచిలువలు క్షీరదాలను, జంతువులను మింగేస్తుండటంతో అధికారులు కొండ చిలువలను పట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇరుల గిరిజన తెగకు చెందిన మాసి సదైయన్‌, వైదివేల్‌ గోపాల్‌ అనే ఇద్దరు 50ఏళ్ల వ్యక్తులను అమెరికాకు తీసుకొచ్చి ఉద్యోగంలో నియమించుకున్నారు. 
 
వీరిద్దరూ తమిళనాడుకే కాదు భారత్‌లోనే పాములు పట్టడంలో నేర్పురులు. వీరితో పాటు ఇద్దరు అనువాదకులు కూడా వెళ్లారు. ఇద్దరు తమిళ వ్యక్తులు అక్కడికి వెళ్లిన ఎనిమిది రోజుల్లోనే 13 కొండచిలువలను పట్టుకుని ఫ్లోరిడా అటవీశాఖ అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ తమిళ వ్యక్తులను, వారి అనువాదకులను ఫ్లోరిడా తీసుకెళ్లడానికి అధికారులు 68,888డాలర్లు (సుమారు రూ.47లక్షలు) చెల్లించినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో తుమ్మినా, కాలు జారిపడినా వార్తే.. తెలంగాణలో 1500 మంది చనిపోతే?: పవన్ కల్యాణ్