Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్‌లో న్యూడ్ ఫోటో.. కోర్టు మెట్లెక్కిన 14 ఏళ్ల మహిళ.. నార్వే ప్రధానికి ఫేస్‌బుక్ సారీ.. ఎందుకు?

1972లో వియత్నాంలో జరిగిన ఒక దాడికి సంబంధించిన ఫొటోను నార్వే ప్రధాని ఎర్నా సోల్ బెర్గ్ ఇటీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో దుస్తులు లేకుండానే పరుగులు పెడుతున్న ఒక

Advertiesment
Facebook faces legal action over naked picture of 14-year-old girl
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (10:35 IST)
1972లో వియత్నాంలో జరిగిన ఒక దాడికి సంబంధించిన ఫొటోను నార్వే ప్రధాని ఎర్నా సోల్ బెర్గ్ ఇటీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో దుస్తులు లేకుండానే పరుగులు పెడుతున్న ఒక చిన్నారి ఈ ఫొటోలో కనపడుతుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ "ఫేస్‌బుక్‌" ఆ ఫొటోను బ్లాక్ చేసింది. ఆ తర్వాత ఫేస్‌బుక్‌ నార్వే ప్రధానికి క్షమాపణలు చెబుతూ ఒక లేఖ రాసింది.
 
ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో నగ్న ఫోటోను అప్ లోడ్ చేశాడని, తద్వారా తన పరువు తీశాడంటూ 14ఏళ్ల బాలిక కోర్టుకెక్కింది. 2014 నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలుసార్లు ఆ ఫొటో ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారని, తన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని, డేటా పరిరక్షణ చట్టాన్ని ఫేస్‌బుక్‌ఉల్లంఘించిందంటూ బాధిత బాలిక ఆరోపించింది. 
 
ఒక వ్యక్తి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి నగ్నఫోటోను సంపాదించి.. ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశాడని, ఆ ఫొటోను పలుసార్లు అప్ లోడ్ చేసినా పట్టించుకోలేదని, తన క్లయింట్ పరువుకు నష్టం కల్గించిన ఫేస్‌బుక్‌ సంస్థ పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని బాలిక తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. 
 
ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఈ బాలిక తన ఫోటోను పదే పదే అప్ లోడ్ చేశాడని.. ఇందుకు ఫేస్‌బుక్‌ కూడా అనుమతించిందంటూ న్యాయవాది అన్నారు. ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్ హైకోర్టును బాధిత బాలిక ఆశ్రయించింది. అయితే, ఈ ఆరోపణలను ఖండిస్తూ ఫేస్‌బుక్‌ యాజమాన్యం చేసిన వాదనను హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలిసి పని చేద్దామంటూ అసభ్యంగా ప్రవర్తించాడు... చిక్కుల్లో ఆప్ నేత