దీపావళి సెలెబ్రేషన్‌లో డొనాల్డ్ ట్రంప్ కోడలు.. చెప్పులు బయట విడిచిపెట్టి హిందూ ఆలయంలోకి...
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత-అమెరికన్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యులను రంగంలోకి దించారు. వర్జీనియాలోని లాడన్ కౌంటీలో రాజధ
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత-అమెరికన్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యులను రంగంలోకి దించారు. వర్జీనియాలోని లాడన్ కౌంటీలో రాజధాని హిందూ దేవాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ కోడలు లారా పాల్గొన్నారు. పనిలో పనిగా ట్రంప్ అయిన మామగారికి ఓటు వేయాలని ప్రవాస భారతీయులను అభ్యర్థించారు.
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్- అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని తెలిపారు. భారత దేశమన్నా, భారతీయులన్నా తన మామగారికి ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. భారతీయ సంస్కృతిని తాను ఎంతోగానే గౌరవిస్తానని పేర్కొంటూ చెప్పులు బయట విడిచిపెట్టి ఆమె ఆలయంలోకి ప్రవేశించారు. హిందూ సాంప్రదాయాలు అంటే తనకెంతో ఇష్టమని ట్రంప్ రెండో కుమారుడు ఎరిక్ భార్య అయిన లారా చెప్పారు.
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నిక పదవికి నవంబరు 8న ఎన్నికలు జరగనుండగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పదేళ్ల క్రితం ఆయన తనను లైంగికంగా వేధించారని అశ్లీల చిత్రాల నటి జెస్సికా డ్రేక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు చేసిన వారిలో ఆమె 11వ మహిళ కావడం గమనార్హం. 2006లో నెవడాలో విరాళా సేకరణ కోసం గోల్ఫ్ పోటీలు నిర్వహించిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుందని ఆరోపించారు.