Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనవాళ్లను నరుకుతూంటే కళ్లుమూసుకోవాలా? టార్చర్ పెట్టాల్సిందేనంటున్న ట్రంప్

దేశభద్రతకోసం ఉగ్రవాదులను టార్చర్‌ చేయటం తప్పుకాదని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా మునుపటి పాలకుల మాదిరిగా, ఉగ్రవాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించదలచుకోలేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఉగ్రవాదుల అంతు తేల్చడ

Advertiesment
America
హైదరాబాద్ , శుక్రవారం, 27 జనవరి 2017 (06:48 IST)
దేశభద్రతకోసం ఉగ్రవాదులను టార్చర్‌ చేయటం తప్పుకాదని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా మునుపటి పాలకుల మాదిరిగా, ఉగ్రవాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించదలచుకోలేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఉగ్రవాదుల అంతు తేల్చడానికి ఎంత కఠిన నిర్ణయాలకైనా తాను సిద్ధమేనని ట్రంప్ స్పష్టం చేశారు.
 
తాలిబన్లపై గతంలో బుష్ హయాంలో అమెరికన్ సైన్యం జరిపిన దారుణ హింసాకాండ బట్టబయలై ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ప్రతిష్ట మసకబారిన నేపథ్యంలో గత అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉగ్రవాదులనుంచి సమాచారం రాబట్టడంలో సైన్యం అవలంబిస్తున్న తీవ్ర చిత్రహింసలను రద్దు చేశారు. కానీ ఇప్పుడు కరుడు గట్టిన జాతీయవాద ప్రచారంతో గెలిచి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మళ్లీ అలాంటి చిత్రహింసల పునరుద్ధరణకు తాను మద్దతిస్తానని చెప్పారు.
 
‘వారు (ఐసిస్‌) కేవలం క్రిస్టియన్  అనే కారణంతో మనోళ్లను పట్టుకుని తలలు నరికేస్తుంటే.. ఎవరూ దీనిపై మా ట్లాడరు. నేను వాటర్‌బోర్డింగ్‌ అనగానే హక్కులు గుర్తొస్తాయా’ అని ఏబీసీ న్యూ స్‌తో ట్రంప్‌ చెప్పారు. ఉగ్రవాదుల విచారణలో వాటర్‌బోర్డింగ్‌ (ముక్కు, నోటి కి గుడ్డకట్టి పైనుంచి నీటిని పోస్తూ ఊపిరాడకుండా చేసి నిజాలు చెప్పించే విధానం) వంటి కఠినమైన పద్ధతులను అవలంబించనున్నట్లు తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోడ కట్టడానికి డబ్బులివ్వకపోతే మా దేశానికి రావద్దు: ట్రంపిజంలో కొత్త పోకడ