Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏయ్.. కాస్త.. నోరు మూసుకుంటావా? అంటూ గద్దించిన డోనాల్డ్ ట్రంప్... చిన్నబోయిన మహిళా జర్నలిస్టు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రప్ నోరు పారేసుకున్నారు. ఆయన గద్దించింది ఓ మహిళా జర్నలిస్టుపై. అదీ కూడా ఓ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Advertiesment
Donald Trump
, గురువారం, 28 జులై 2016 (16:04 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రప్ నోరు పారేసుకున్నారు. ఆయన గద్దించింది ఓ మహిళా జర్నలిస్టుపై. అదీ కూడా ఓ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ‘నోరు మూసుకుంటావా’ అంటూ విరుచుకుపడ్డారు. దీంతో నొచ్చుకున్న ఆ రిపోర్టర్ మళ్లీ ప్రశ్నలు అడగడం మానేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఫ్లోరిడాలో జరిగిన విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ట్రంప్ ఎన్‌బీసీ రిపోర్టర్‌ కేటీ టర్ సంధించిన ప్రశ్నకు మాత్రం అసహనం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందినవారి కంప్యూటర్‌ను హ్యాక్ చేయమని రష్యా, చైనా వంటి విదేశాలను మీరెలా అడుగుతారంటూ కేటీ టర్ ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ట్రంప్ అన్న మాటలనే ఆమె ప్రస్తావించి సమాధానం కోసం ఆయనను ఇరకాటంలో పడేశారు. 
 
ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలు సంధించేందుకు ఆ రిపోర్టర్ అడిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో మధ్యలోనే కల్పించుకున్న ట్రంప్ ఇక చాలు.. నోరు మూసుకుంటావా అంటూ గద్దించారు. దీంతో చిన్నబోయిన ఆమె మారు మాట్లాడకుండా కూర్చున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.10 లక్షల లంచం.. స్టింగ్ ఆపరేషన్‌‍లో అడ్డంగా చిక్కిన ఏపీ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్!