దక్షిణాఫ్రికాలో జాతివవక్షపై అవిశ్రాంపోరాటం చేసిన ఎల్.జి.బి.టిల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు కన్నుమూశారు. ఆయన వయసు 90 యేళ్లు. కేప్‌టౌన్‌లో తెల్లవారుజాము సమయంలో కేప్‌టౌన్‌లో తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని సౌతాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమాఫోసా వెల్లడించారు. దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన వారిలో మరో మహోన్నత వ్యక్తిని కోల్పోయామని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన టుటు గురించి సైరిల్ మాట్లాడుతూ, వర్ణ వివక్ష శక్తులకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు అణచివేతకు, అన్యాయం, హింసకు గురైన బలహీనవర్గాల ప్రజలకు ఆయన అండగా ఉన్నారని చెప్పారు. ఫలితంగా ఈయనకు గద 1984లో నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ఈయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు ప్రపంచ దేశాధినేతలు తమ సంతాపాన్ని తెలిపారు.