Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Advertiesment
భారత్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (20:15 IST)
భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఛీఫ్ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రెయేసస్ ఓ ప్రకటన వెల్లడించారు. అక్టోబరులో కరోనా టీకాలను ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించినందుకు ఆయన ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. 
 
ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40 శాతం టీకాలు వేయాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు మద్దతుగా తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైందన్నారు. ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా.. కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్​ టీకాలు అందించి భారత్‌ అండగా నిలిచింది. రెండోదశలో మహమ్మారి విజృంభణతో టీకాల ఎగుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే.
 
ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు అందించాలని నిర్ణయించింది. భారత్‌లో అదనంగా ఉన్న కొవిడ్​ టీకాలను ‘వ్యాక్సిన్​మైత్రి’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ హయాంలో దేశం విరాజిల్లుతోంది: ప్రకాష్ జవదేకర్