Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీమంతుల సిటి న్యూయార్క్ దుస్థితి చూడండి.. పాక్ ప్రజలకు ఇమ్రాన్ విజ్ఞప్తి

Advertiesment
శ్రీమంతుల సిటి న్యూయార్క్ దుస్థితి చూడండి.. పాక్ ప్రజలకు ఇమ్రాన్ విజ్ఞప్తి
, ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (19:00 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని తమ దేశ ప్రజలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. కోటీశ్వరులు నివసించే న్యూయార్క్ మహానగరం పరిస్థితిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. 
 
పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వేయ్యికి పైగా కరోనా కేసుల నమోదైన నేపథ్యంలో ఇమ్రాన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. కరోనా కట్టడి కోసం అక్కడి అధికారుల చేపడుతున్న పరీశీలించిన అనంతరం.. అక్కడ తత్కాలికంగా ఏర్పాటు చేసిన కరోనా ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదన్నారు. 
 
'కరోనా మాకు సోకదనే తప్పుడు అభిప్రాయం ఎవ్వరికీ ఉండకూడదు. ధనవంతులు నివశించే న్యూయార్క్ పరిస్థితి ఏమైందో చూడండి. కరోనా ప్రళయం ఎప్పటికి అంతమవుతుందో నాతో సహా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు' అని ఆయన అన్నారు. 
 
ముఖ్యంగా, అమెరికాలో శ్రీమంతుల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్ సిటీ పరిస్థితి ఎలా ఉందో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. అందువల్ల కరోనా వైరస్ విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా మృతులు 79... మొత్తం కేసులు 3374 : లవ్ అగర్వాల్