కాన్ఫరెన్స్ హాల్‌లో డొనాల్ట్ ట్రంప్ లైంగిక ఆరోపణలను ప్రస్తావించారు: జేమ్స్ కోమీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. వీసాల నిషేధం, అవుట్ సోర్సింగ్ కట్ వంటి అంశాలతో ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతున్న ట్రంప్‌కు షాక్ తగిలింది. మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. వీసాల నిషేధం, అవుట్ సోర్సింగ్ కట్ వంటి అంశాలతో ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతున్న ట్రంప్‌కు షాక్ తగిలింది. మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైకేల్ ఫ్లిన్‌కు రష్యాతో లింకులున్నాయన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును ఆపివేయాలని అధ్యక్షుడు తనను అడిగారని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ బాంబు పేల్చారు. ఈ మేరకు సెనేట్ నిఘా వ్యవహారాల కమిటీకి లిఖితపూర్వక వాంగ్మూలం సమర్పించారు.
దీంతో డొనాల్డ్ ట్రంప్‌పై విపక్ష డెమోక్రాట్లు ఫైర్ అవుతున్నారు. శుక్రవారం సెనేట్ కమిటీ విచారణ జరుగనుండగా, ఆయనిచ్చిన ఏడు పేజీల వాంగ్మూలాన్ని ఓ రోజు ముందు కమిటీ విడుదల చేయడం గమనార్హం. గత జనవరి 27న వైట్ హౌస్ గ్రీన్ రూమ్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో పాటు తాను ప్రైవేట్ డిన్నర్‌కు హాజరైనట్లు కోమీ వాంగ్మూలంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా జేమ్స్ ట్రంప్‌పై ఆరోపణల గుప్పించారు. తనను విధుల నుంచి తొలగించే వరకూ ట్రంప్ తనను ఏ రకంగా లక్ష్యం చేసుకున్నదీ సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీకి వివరించారు. మొత్తం ఏడు పేజీల సాక్ష్యాన్ని సమర్పించారు. మైక్ ఫ్లైన్ పై కేసును వదిలివేయాలని ట్రంప్ కోరారని, రష్యా జోక్యంపై దర్యాప్తును ఓ మేఘంతో ట్రంప్ పోల్చారని అన్నారు. అప్పటికే తాను ట్రంప్ దర్యాప్తు పరిధిలోకి రాననే విషయాన్ని మూడుసార్లు ఆయనకు చెప్పినట్టు పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి 6న ట్రంప్‌ను తొలిసారిగా ట్రంప్ టవర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలిసి, ఆయనపై వచ్చిన లైంగిక, ఇతర ఆరోపణల విషయాలను ప్రస్తావించినట్టు తెలిపారు. జనవరి 27న వన్ టు వన్ డిన్నర్‌లో మరోమారు ట్రంప్‌ను కలిసిన సందర్భంలో ఆయన నుంచి దిగజారిన సంభాషణ వినాల్సి వచ్చిందని ఏడు పేజీల సాక్ష్యంలో పేర్కొన్నారు.