Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లడఖ్ నియంత్రణ రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు..

Advertiesment
లడఖ్ నియంత్రణ రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు..
, మంగళవారం, 12 మే 2020 (18:18 IST)
Ladakh
లడఖ్ నియంత్రణ రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ చర్యతో భారత సైన్యం అప్రమత్తమైంది. . చైనా యుద్ధ విమానాల పెట్రోలింగ్‌తో భారత వాయుసేన పెద్దసంఖ్యలో యుద్ధ విమానాలను లడఖ్‌లో మోహరించింది. ఇప్పటికే నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ యుద్ధ విమానాల పెట్రోలింగ్ నేపథ్యంలో.. భారత్ విషయంలో చైనా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా వున్నాయి. వైరస్ పుట్టిన వద్దనే అంతం చేసివుంటే బాగుండేదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యాఖ్యానించడం చర్చకొచ్చింది. అలాగే కోవిడ్‌-19 మూలాలపై ప్రపంచ దేశాలు చైనా వైపు సందేహంగా చూడటంతో పాటు పలు బహుళజాతి కంపెనీలు బీజింగ్‌ నుంచి భారత్‌కు తమ కార్యకలాపాలను తరలించాలని యోచిస్తుండటంతో అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ఒత్తిడి పెరిగింది.
 
చైనాను చుట్టుముడుతున్న ఒత్తిళ్లతోనే డ్రాగన్‌ ఆర్మీ అసహనంతో దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని అధికారిక వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లోకి ప్రవేశించాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్, అదనపు భారం వేయలేదు