Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎస్కలేటర్...! ఆమెను కళ్ళముందే మింగేసింది... !! ఎక్కడ? ఎలా..?

Advertiesment
China woman dies after falling into escalator
, సోమవారం, 27 జులై 2015 (21:15 IST)
లిఫ్టులో ఇరుక్కున్న వారిని చూశాం. చనిపోయిన వారిని విన్నాం. కాని ఎస్కలేటర్‌లో ఇరుక్కుని చనిపోయిన సంఘటన ఎక్కడైనా చూశారా.. ఎక్కడానికి చాలా సులభతరంగా, అనుకూలంగా ఉండే ఎస్కలేటర్ మనుషుల ప్రాణాలు కూడా తీస్తాయి. వాటికి నోటి చిక్కామా ఇక బతకడం కష్టమే. చైనాలో ఈ సంఘటన జరిగింది. లిఫ్టు ఎక్కుతూ తన ప్రాణాలు కోల్పోయింది. తన బిడ్డను మాత్రం రక్షించగలిగింది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
చైనాలోని జింగ్‌హూ సిటీలో సుమారు 30 ఏళ్ల వయసున్న ఓ మహిళ తన కొడుకుతో ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లింది. ఆమె పైఅంతస్తుకు వెళ్లేందుకు ఎస్కలేటర్ ఎక్కింది. దాటుకుంటుండగా ఒక్కసారిగా ఎస్కలేటర్ చివరి అంచు సిల్వర్ ప్లేటు ఎగిరిపోయింది. రెప్పపాటులో ఆమె ఆ సందులో ఇరుక్కుపోయింది. తన కొడుకు మాత్రం ముందుకు తోసేసింది. ఇంతలో తిరిగిన ఎస్కలేటర్ ఆమెను లాగేసింది. 
 
కళ్ళ ముందే ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోయాయి. రాకాసి ఎస్కలేటర్ ఆ మహిళను మింగేసింది. పక్కనున్న వారు అప్రమత్తమయ్యారు. అయితే పిల్లాడిని మాత్రం కాపాడగలిగారు. ఆమెను లాగబోయే లోపు ఎస్కలేటర్ ఆమెను లాగేసింది. కళ్ళముందే ఆమె ఎస్కలేటర్ కింద భాగంలోకి వెళ్లిపోయింది.  చైనాలోని షాపింగ్‌మాల్స్‌లో ఎస్కలేటర్ ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu