Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్దనోట్లతో అవినీతి పోదు... వీటితో మోదీ వల్ల కాదు... గోల్డ్, రియల్ ఎస్టేట్... మోదీకి చైనా చిట్కాలు

భారతదేశంలో అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం అణచివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేయడంతో అవినీతి అంతం కాదని పొరుగుదేశం చైనా మీడియా పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేయడం సాహసోపేతమైన చర్య అయినప్పటికీ భారతదేశంలో అవినీతిని పూర్

Advertiesment
పెద్దనోట్లతో అవినీతి పోదు... వీటితో మోదీ వల్ల కాదు... గోల్డ్, రియల్ ఎస్టేట్... మోదీకి చైనా చిట్కాలు
, సోమవారం, 14 నవంబరు 2016 (15:57 IST)
భారతదేశంలో అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం అణచివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేయడంతో అవినీతి అంతం కాదని పొరుగుదేశం చైనా మీడియా పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేయడం సాహసోపేతమైన చర్య అయినప్పటికీ భారతదేశంలో అవినీతిని పూర్తిగా అంతమొందించాలంటే ఇది చాలదని వెల్లడించింది. అంతేకాదు.... అవినీతిని తరిమికొట్టాలంటే మరికొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుందని తెలిపింది. 
 
పెద్ద నోట్లను రద్దు చేయంతో సరిపోదు. మరిన్ని సంస్కరణలు చేయాల్సి ఉంది. ఆ సంస్కరణలు కావాలంటే ఆయన బీజింగ్ నుంచి తీసుకోవచ్చు అంటూ తెలిపింది. అవినీతిని నిరోధించేందుకు చైనా అధ్యక్షుడు క్జిన్ పింగ్ తీసుకున్న చర్యలు ద్వారా 10 లక్షల మందికి పైగా అధికారులు శిక్షించబడ్డారు. అలాంటి శిక్షలు అమలుచేసినప్పుడే అవినీతి అంతం అవుతుంది. 2012లో ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత అవినీతి నిరోధక చట్టాలను మరింత కఠినతరం చేయడం ద్వారా అవినీతిపరుల్లో వణుకుపుట్టించారు. 
 
తద్వారా ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడాలంటే గజగజలాడుతున్నారు. క్జిన్ పింగ్ చర్యలకు చైనా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు... మోదీ రియల్ ఎస్టేట్, బంగారు నగల నిల్వలు కలిగి ఉన్నవారిపైన కూడా చర్యలు తీసుకుంటేనే అవినీతికి పూరిస్థాయిలో చెక్ పెట్టవచ్చని చైనా మీడియా తెలుపుతోంది. మరి చైనా అనుసరించిన విధానాలను మోదీ అనుసరిస్తే బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన బడా చేపలు కూడా గిలగిలకొట్టుకుంటాయేమో...?!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.500, రూ.1000 నోట్ల రద్దు.. వయోవృద్ధులు, దేవాంగులకు ప్రత్యేక క్యూ..