Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండెపోటుతో చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూత

Li Keqiang
, శుక్రవారం, 27 అక్టోబరు 2023 (15:05 IST)
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ మృతి చెందారు. ఆయన గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 68 యేళ్లు. గుండెపోటుతో మాజీ ప్రధాని లీ మృతి చెందారని చైనా అధికారిక మీడియా శుక్రవారం వెల్లడించింది.
 
సంస్కరణల ఆలోచలు ఉన్న బ్యూరోక్రాట్‌గా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న లీ కెడియాంగ్ ఒకానొక సమయంలో చైనా భవిష్యత్తు నాయకుడిగా మారతాడని అంతా భావించారు. అయితే అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కారణంగా మరుగునపడిపోయారు. దాదాపు పదేళ్లపాటు అధ్యక్షుడు జిన్ పింగ్ హయాంలోనే ప్రధాన మంత్రిగా పనిచేసి విశేష సేవలు అందించారు.
 
లీ గురువారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారని, హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ఆయన శ్వాస విడిచారని ఆ దేశ అధికార మీడియా 'జినూవా' తెలిపింది. ఆయన కొంతకాలంగా షాంఘైలోనే ఉంటున్నారని తెలిపింది. ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో తనతోటి వారితో పోల్చితే ఆధునిక వ్యక్తిగా గుర్తింపుపొందారు. 
 
ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యమున్న ఆయన చైనా ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. యువతను ఉదారవాద భావనలవైపు ప్రోత్సాహించేవారు. అయితే పార్టీ పరిమితులను ఏమాత్రం దాటేవారు కాదు. ఆయన చైనా అధికార పార్టీ అధినేతగా కూడా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1720 ఉద్యోగ అవకాశాలు