Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్జికల్స్ స్ట్రైక్స్‌‌ మాటెత్తని నవాజ్ షరీఫ్: యుద్ధం వద్దు.. శాంతే ముద్దు.. పొలాల్లోకి యుద్ధ ట్యాంకర్లు తీసుకెళ్తే?

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో గల ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ పేరిట భారత ఆర్మీ నిర్వహించిన దాడులను బూటకమని చెప్తూ వస్తున్న పాకిస్థాన్.. తాజాగా భారత్‌తో యుద్ధం వద్దంటోంది. ఈ మేరకు పాకిస్థాన్

సర్జికల్స్ స్ట్రైక్స్‌‌ మాటెత్తని నవాజ్ షరీఫ్: యుద్ధం వద్దు.. శాంతే ముద్దు.. పొలాల్లోకి యుద్ధ ట్యాంకర్లు తీసుకెళ్తే?
, బుధవారం, 5 అక్టోబరు 2016 (18:47 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో గల ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ పేరిట భారత ఆర్మీ నిర్వహించిన దాడులను బూటకమని చెప్తూ వస్తున్న పాకిస్థాన్.. తాజాగా భారత్‌తో యుద్ధం వద్దంటోంది. ఈ మేరకు పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నోరు విప్పారు. కానీ ఇండియన్ ఆర్మీ ఎన్‌కౌంటర్లో మృతి చెందిన బుర్గాన్ వనిని మళ్లీ హీరోగా అభివర్ణించారు. ఇంకా ఉగ్రవాద దాడులకు తాము ఎక్కువగా బలయ్యామని చెప్పుకొచ్చారు. 
 
యూరీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంప్‌పై జరిగిన దాడికి ఎలాంటి విచారణ చేపట్టకుండానే పాకిస్థాన్‌ను బాధ్యులని చేయడం, ఆరోపణలు గుప్పించడం సబబు కాదని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. తాము శాంతిని కోరుకుంటున్నామే కానీ, యుద్ధాన్ని కాదని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు.
 
కానీ కాశ్మీర్‌పై పాత పాటే పాడిన షరీఫ్, యూరీ దాడికి ప్రతిగా భారత బలగాలు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోయారన్నారు. అయితే సర్జికల్ స్ట్రైక్స్‌నే నవాజ్ షరీఫ్ అలా అన్నారు. భీకర కాల్పులని నవాజ్ నోట మాట వచ్చిందే కానీ, సర్జికల్స్ స్ట్రైక్స్‌గా ఆ దాడులను అంగీకరించలేదు.
 
ఇంకా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారత్-పాక్‌ల మధ్య కాశ్మీర్ సమస్యతో పాటు అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరిచుకోవాలనుకున్నట్లు ప్రకటించారు. భారత ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా కాశ్మీర్ యువత తిరుగుబాటు చేశారని నవాజ్ షరీఫ్ విమర్శించారు. కాశ్మీర్ స‌మ‌స్య విష‌యంలో ఐక్య‌రాజ్య‌స‌మితి తీర్మానాల‌ను ప్ర‌పంచ దేశాలు అమ‌లు అయ్యే విధంగా చూడాల‌న్నారు.
 
కాశ్మీర్ అంశంపై భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు శతవిధాలా ప్రయత్నించినా భారత్ మాత్రం ముందడుగు వేయలేదని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. పాక్‌లో నెల‌కొన్న పేద‌రికాన్ని నిర్మూలించేందుకు యుద్ధం ప్ర‌క‌టించాల‌ని భార‌త ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ష‌రీఫ్ కౌంట‌ర్ ఇచ్చారు. పొలాల్లోకి యుద్ధ ట్యాంక‌ర్ల‌ను తీసుకెళ్ల‌డం ద్వారా పేదరికాన్ని నిర్మూలించ‌లేమ‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రకు ఉపాధి కోసం వెళ్తే.. భర్తను చంపేస్తానని వివాహితపై బంధువే అత్యాచారం చేశాడు..