Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌కు వాత పెట్టిన సౌదీ సర్కారు!!

పాకిస్థాన్‌కు వాత పెట్టిన సౌదీ సర్కారు!!
, బుధవారం, 12 ఆగస్టు 2020 (17:50 IST)
పాకిస్థాన్‌కు సౌదీ ప్రభుత్వం వాత పెట్టింది. కాశ్మీర్ అంశంలో తమకు వంతపాడటం లేదని పేర్కొంటూ సౌదీ సర్కారును తప్పుబట్టేందుకు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై సౌదీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అందించిన 3 బిలియన్ డాలర్ల రుణంలో ఒక బిలియన్ డాలర్లను నిర్మొహమాటంగా వసూలు చేసింది. మిగతా రెండు బిలియన్ డాలర్ల రుణంపై ఒత్తిడి పెంచింది. 
 
కాగా, కాశ్మీర్ అంశంలో భారత్‌పై సౌదీ అరేబియాను ఎగదోయాలనుకున్న పాకిస్థాన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) కాశ్మీర్ అంశంలో తగిన రీతిలో స్పందించడంలేదని, ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీయవచ్చని పాక్ హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యలు చేసింది. 
 
ఓఐసీలో చీలికలు వచ్చే అవకాశం కూడా ఉందని పాక్ విదేశాంగ మంత్రి బెదిరింపు స్వరం వినిపించారు. 57 దేశాల సభ్యత్వం ఉన్న ఓఐసీని కాశ్మీర్ అజెండాపై సమావేశపర్చడంలో విఫలమవుతున్నారంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు, కాశ్మీర్ అంశంపై తామే ఓఐసీని సమావేశపర్చుతామని అన్నారు.  
 
అయితే, ఈ వ్యాఖ్యలను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాము అందించిన 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును సౌదీ నుంచి రాయితీపై పొందే ఒప్పందం కూడా పాక్‌కు దూరంకానుంది. ఇటీవల ఒప్పందం ముగిసినా మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ, పాక్ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న సౌదీ ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకుంది. దాంతో పాక్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాగింగ్‌కు వచ్చిన మహిళ.. నీలి చిత్రం చూసి రెచ్చిపోయిన వృద్ధుడు...