బ్రిటన్ వ్యాప్తంగా మరోమారు లాక్‌డౌన్ తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. లండన్‌లో కరోనా వ్యాప్తి రెండో దశ ప్రారంభమైందని ఆ దేశ ప్రధాని బోరిన్ జాన్సన్ ప్రకటించారు. వాస్తవంగా మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు వెళ్లకూడదనే భావిస్తున్నామని, అవసరమైతే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాగా, యూరప్ దేశాల్లో కరోనా మహమ్మారి బారినపడి అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రిటనే. అక్కడ దాదాపు 42 వేల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కొత్త కేసుల నమోదు కొంతమేరకు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వైరస్ మరింత చెలరేగకుండా ఉండాలంటే మరోమారు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ఒక్కటే మార్గమని అక్కడి వైద్య నిపుణలు సూచించారు.